హీరోయిన్ సాయి పల్లవి మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టక ముందే మంచి క్రేజ్ సంపాదించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'ఫిదా' సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. డాన్సుల పరంగా మరియు యాక్టింగ్ పరంగా తెలుగు సినిమా ప్రేక్షకులను ‘ఫిదా’ తో ఎంతగానో అలరించిన సాయిపల్లవి తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి పెళ్లి గురించి ఆమె చెప్పిన ఆన్సర్ అభిమానులను షాక్ కు గురి చేసింది.

IHG't in 'celebratory mood' this birthday- The New ...

ఇంతకీ 'ఫిదా' బ్యూటీ పెళ్లి గురించి చెప్పిన సమాధానం ఏమిటి అంటే… జీవితంలో తన పెళ్లి చేసుకోనని కరాఖండిగా చెప్పేసింది. దానికి కారణం కూడా తెలిపింది. తనకి తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం, వాళ్లను విడిచిపెట్టి ఉండలేనని ఆమె చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకోవడం వల్ల తాను తల్లిదండ్రులకు దూరంగా ఉండటం నేను భరించలేనని… ముఖ్యంగా వాళ్ళ బాధ్యతలు నెరవేర్చడం కష్టమవుతుందని, అందువల్లే పెళ్లి అనేది నా జీవితంలో లేదని అది ముగిసిన అధ్యాయం అన్నట్టుగా సాయి పల్లవి తెలిపింది. సాయిపల్లవి ఆన్సర్ విని ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ తిన్నారు.

IHG's flick

ప్రస్తుతం సాయి పల్లవి రానా నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమాలో అదేవిధంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' సినిమాలో నటిస్తోంది. లవ్ స్టోరీ లో హీరోగా నాగచైతన్య నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొత్తం అయిపోయింది. లాక్ డౌన్ కారణంగా సినిమా హాల్స్ క్లోజ్ అవ్వడంతో వచ్చే దసరాకి ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: