టాలీవుడ్ ఇపుడు పెద్ద సంక్షోభంలో ఉంది. సినిమాలు నూటికి తొంబై శాతం ఫట్. కేవలం అయిదు నుంచి పది శాతం మాత్రమే  హిట్. ఇది కరోనా ముందు వరకూ సీన్. ఇక అది కూడా సీజల వారీగానే డిమాండ్, మార్కెట్ కనిపిస్తోంది. సమ్మర్, దసరా, సంక్రాంతి. ఈ మూడు సీజన్లను నమ్ముకుని టాలీవుడ్ సినిమాలు తీస్తోంది.

IHG

ఇపుడు కరోనా పుణ్యామాని అన్ని సీజన్లూ ఒక్కసారిగా  అమావాస్యగా మారిపోయాయి. ఇక లాక్ డౌన్ దెబ్బ బాగా సినీ ఇండస్ట్రీ మీద పడింది. థియేటర్లు మూడు నెలలుగా మూతపడ్డాయి. అవి మళ్ళీ రీఓపెన్ ఎపుడు అవుతాయో తెలియదు. ఒకవేళ ఓపెన్ అయినా కూడా పూర్వం కళ వస్తుందా అంటే అది పెద్ద డౌట్.

IHG

ఎందుకంటే ఇప్పటికే తిరుగుతున్న బస్సుల్లోనే జనం ఎక్కువగా కనిపించడంలేదు.తెరచుకున్న‌ షాపింగ్ మాల్స్ కూడా డల్ గా ఉంటున్నాయి. వాటిని మించి థియేటర్లకు జనం రావాలంటే వారికి ఏం అవసరం ఉంటుంది. ఇపుడున్న పరిస్థితుల్లో ఆర్ధికంగా చితికిన జనానికి సినిమా పెద్దగా  అవసరం కూడా కాదు.

IHG'Dirty War' Of 'Exploitation' In <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TOLLYWOOD' target='_blank' title='tollywood-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>tollywood</a> Films Propoganda ...

అందువల్ల కరోనా ప్రభావం తగ్గినా లాక్ డౌన్ ఎత్తివేసినా కూడా రెండు మూడేళ్ళ పాటు సినిమాలకు ఇబ్బందులు ఉంటాయని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. దాంతో వారంతా ఇపుడు ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బడ్జెట్ సగానికి సగమైనా  తగ్గించుకుని సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారట.

IHG

ముఖ్యంగా  హీరోల పారితోషికాల్లో భారీ కోత పెట్టాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. హీరోలకు ఇపుడు ఇచ్చే పారితోషికంలో కనీసంగా పాతిక నుంచి ముప్పయి శాతమైనా  కటింగ్ తప్పదని అంటున్నారు. ఒక హీరో సినిమాకు పాతిక కోట్లు ఇప్పటిదాకా పుచ్చుకుంటే అతనికి రేపటి రోజున ఇచ్చేది ఏ పదిహేను కోట్లకో పడిపోతుంది. దానిని కచ్చితంగా అమలు చేయాలని హీరోలు కూడా దానికి సహకరించాలని నిర్మాతలు కోరబోతున్నారుట. మరి అదే జరిగితే స్టార్ హీరోలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: