తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరో నాగార్జున. స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ తనదైన టాలెంటుతో ఎంతగానో క్రేజ్  సంపాదించారు నాగార్జున. తెలుగు ప్రేక్షకులందరికీ నవమన్మధుడు గా మారిపోయాడు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు నాగార్జున. మాస్ యాక్షన్ సినిమాలతో పాటు కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు... హిస్టోరికల్ సినిమాలు.. ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ఎంతగానో గుర్తింపు సంపాదించారు. అయితే నాగార్జున హీరోగా నటించిన సినిమాల్లో చాలా సన్నివేశాలు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. 

 


 ఇలా నాగార్జున నటించిన సినిమాల్లో  ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకునే సన్నివేశాలు చాలా ఉన్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో నాగార్జున స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో... అప్పటి స్టార్ డైరెక్టర్ అయినా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ  సినిమాలో... నాగార్జున సైకిల్ చైన్ లాగిన సన్నివేశం ఎప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులకు ఆల్ టైం ఫేవరేట్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక శివ సినిమా నాగార్జున కెరియర్ ను కీలక మలుపు తిప్పింది. సరికొత్త మాస్ ఫాలోయింగ్ ఉన్న నాగార్జునకి తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఈ సినిమాలో నాగార్జున ఫైట్ చేస్తున్న సమయంలో సైకిల్ చైన్ లాగిన సన్నివేశం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికి కూడా మనసులో మెదులుతూ ఉంటుంది. 

 


 ఇక ఈ సినిమా తర్వాత నాగార్జున హీరోగా నటించిన మాస్  సినిమాలోని కొన్ని సన్నివేశాలు కూడా ప్రేక్షకుల మదిలో నిలిచి పోయాయి అని చెప్పాలి. ముఖ్యంగా అందులో నాగార్జున చేస్తున్న సమయంలో... కుడికాలిని పైకి లేపి గాలిలో ఆడిస్తూ ఉంటే కింద నుంచి పూర్తిగా దుమ్ములేపేసి... నాగార్జున ముందుకు వస్తుంది... ఆ సమయంలో నాగార్జున దాన్ని చూసి  మాస్ తో పెట్టుకుంటే దుమ్ము లేచిపోద్ది అంటూ  డైలాగ్స్ చెబుతాడు. ఈ ఒక్క సన్నివేశం తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అక్కినేని అభిమానుల్లో  సుస్థిరస్థానం సంపాదించుకుంది అని అని చెప్పాలి.. మాస్ సినిమా తర్వాత ఈ సన్నివేశాన్ని ఎన్నో సినిమాల్లో కూడా వాడారు. ఈ సన్నివేశం ఎన్నిసార్లు చూసినా అదే కిక్కు ఇస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: