ఢిల్లీ డాల్ రాశిఖన్నా ఊహలు గుస గుసలాడే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి మంచి సక్సస్ ఫుల్ సినిమాలే చేసింది. రాశిఖన్నా మొదటి సినిమా సక్సస్ తో ఇండస్ట్రీ దృష్ఠిని బాగా ఆకర్షించింది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరం తేజ్, గోపీచంద్, రాం, ఎన్.టి.ఆర్, విజయ్ దేవరకొండ.. ఇలా టాలీవుడ్ లో స్టార్ హీరోలతో మంచి హిట్ సినిమాలలో నటించింది. ఇప్పటికి రాశీఖన్నా కి తెలుగులో మంచి పాపులారిటి ఉంది. మంచి రెమ్యూనరేషన్ కూడా అందుకుంటోంది. చెప్పాలంటే యంగ్ హీరోలందరికి మంచి ఛాయిస్ రాశిఖన్నా. 

 

ఇక రీసెంట్ గా ప్రతీరోజు పండగ సినిమాతో మంచి కమర్షియల్ సక్సస్ ను అందుకుంది. అయితే చాలా కాలం నుండి రాశీఖన్నా కి తమిళ సినిమాలలో నటించాలన్న కోరిక అలాగే అక్కడ స్టార్ హీరోయిన్ అవ్వాలన్న ఆశ బాగా ఉండేది. మొత్తానికి ఆ ఆశలు నెరవేర్చుకుంటోంది. ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన రాశీఖన్నా ఛాన్స్ అందుకుంది. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళనుందని కోలీవుడ్ మీడియా సమాచారం. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం ఇప్పటికి రావడం అది కూడా సూర్య వంటి స్టార్ పక్క నటించే అవకాశం కావడంతో ఈ అమ్మడు ఎప్పుడెప్పుడు తమిళ పరిశ్రమలోకి అడుగుపెడతానా అంటూ ఆతృతగా ఉందట. 

 

అయితే తాజాగా టాలీవుడ్ లో రాశీఖన్నా గురించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే సక్సస్ లు దక్కుతున్నప్పటికి ఈ బ్యూటికి బ్యాడ్ టైం వెనకాలే ఉందని. వాస్తవంగా సక్సస్ లు వస్తున్న హీరోయిన్స్ వెనకాలే మేకర్స్ అలాగే హీరోలు పడుతుంటారని లక్కీ హీరోయిన్ గా కితాబు ఇస్తూ నెత్తి మీద పెట్టుకుంటారని అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తారన్న సంగతి తెలిసిందే. అందుకు ప్రస్తుతం ఉదాహరణగా పూజా హెగ్డే, రష్మిక మందన్నలనే చెప్పొచ్చు.

 

కాని ఇక్కడ రాశీఖన్నా విషయంలో అది రివర్స్ లో కనిపిస్తుంది. యంగ్ హీరోలకి మంచి ఛాయిస్ అయినా నటన పరంగా మంచి పేరున్న సక్సస్ లు వస్తున్నా రాశీఖన్నా చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేకపోవడం. మరి లోపం ఎక్కడుందో ఈ బ్యూటీకైనా తెలుసా లేదా అని చాలామంది మాట్లాడుకుంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: