సినిమా హిట్ కావాలంటే ఆడియన్స్ ను మెప్పించే అంశాలు పక్కాగా ఉండాల్సిందే. సినిమా అంతా ఆకట్టుకునేలా ఉన్నా కూడా సరైన సమయంలో సినిమా లెవల్ ను పెంచే సిన్ ఉండాలి. అటువంటి సీన్ సినిమాకు చాలా కీలకం. ఇటువంటి సన్నివేశాలు సాధారణంగా స్టార్ హీరోల అభిమానులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. తెలుగులో అప్రతిహతమైన ఇమేజ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న ఫ్యాన్ బేస్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. ఆయన కనిపిస్తే ఊగిపోయే ఫ్యాన్స్ కు కిక్కెక్కించే సన్నివేశాలుంటే వారి ఆనందానికి హద్దేముంటుంది.

IHG

 

పవన్ కల్యాణ్ కెరీర్లో ఇప్పటివరకూ వచ్చిన సనిమాల్లో ఫుల్ ఫవర్ ప్యాక్డ్ సినిమా అంటే ఠక్కున గుర్తొచ్చేది ‘గబ్బర్ సింగ్’. ఆ సినిమా సాధించిన సంచలన విజయానికి ముఖ్య కారణం ఆయన చెప్పిన డైలాగులు.. సెకండాఫ్ లో వచ్చే అంత్యాక్షరి సీనే కారణం. ‘నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది’, ‘నాకు నేనే పోటీ.. నాతో నాకే పోటీ’, ‘నేను ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తా’, ‘వాడు నా ఫ్యాన్.. నేను చెప్పినా ఒకటే నా ఫ్యాన్ చెప్పినా ఒకటే’.. ఇలాంటి డైలాగులతో పవన్ రఫ్పాడేస్తే.. అభిమానుల ఈలలు, గోలలతో ధియేటర్లు హోరెత్తిపోయాయి.

IHG

 

సెకండాఫ్ లో వచ్చే అంత్యాక్షరి.. సినిమా సాధించిన భారీ విజయంలో కీలకపాత్ర పోషించింది. రౌడీలతో రొమాన్స్ చేయాలి అంటూ పవన్ చెప్పిన ఐడియాను దర్శకుడు హరీశ్ శంకర్ అద్భుతంగా మలిచాడు. దాదాపు పావుగంట సన్నివేశాన్ని పవన్ తన స్టైల్ యాక్షన్ తో మెప్పించాడు. సినిమాలో పోలీస్ గా పవన్ మాస్ స్టైల్, గన్ తిప్పడం, తన మేకోవర్ తో వన్ మ్యాన్ షో చేసేశాడు. అందుకే పవన్ అభిమానులకు ‘గబ్బర్ సింగ్’ ఎప్పుడూ ప్రత్యేకమే.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: