చైనా నుండి ప్రపంచ దేశాలకి విస్తరించిన కరోనా వైరస్, ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తుంది. మొదట్లో ఈ వైరస్ గురించి అంతా తేలిగ్గా తీసుకున్నారు. కానీ తీవ్రత తెలిసిన తర్వాత అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించారు. కానీ అంతలోపే కరోనా చేయాల్సిందంతా చేసేసింది. ఒకరి నుండి మరొకరికి వ్యాపించే ఈ కరోనా వైరస్ రోజు రోజుకీ మరింత విజృంభిస్తుంది.

 

మన దేశంలో ఈ వైరస్ బారి నుండి కాపాడుకోవడానికి లాక్డౌన్ ని ఉపయోగించారు. సుమారు రెండు నెలల వరకి పూర్తి లాక్డౌన్ ప్రయోగించారు. అయితే లాక్డౌన్ ఉన్నన్ని రోజులు కంట్రోల్ లోనే ఉన్న కరోనా వైరస్, ఆ తర్వాత సడలింపులు పెరుగుతున్న కొద్దీ దాని ప్రభావం కూడా పెరుగుతూ వచ్చింది. ఇంతకుముందు రోజుకి తక్కువ మొత్తంలో కేసులు నమోదయ్యేవి. కానీ ఇప్పుడు నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తుంటే ప్రతీ ఒక్కరికీ భయం కలుగుతుంది.

 

అయితే కరోనా ఉధృతి తగ్గడానికి సీనియర్ డైరెక్టర్ తేజ కొన్ని సూచనలు చేసాడు. కరోనా పెరగడానికి కారణం మన నిర్లక్ష్య వైఖరే ప్రధాన కారణమని, మన ఆటిట్యూడ్ మారితేనే కరోనా కట్టడి అవుతుందని లేదంటే రోజుకి లక్ష పాజిటివ్ కేసులు పెరిగినా ఆశ్చర్యం లేదని దర్శకుడు తేజ హెచ్చరిస్తున్నారు. కరోనా కేసుల విషయంలో 11వ స్థానంలో ఉన్న ఇండియా రెండు వారాల్లోనే ఏకంగా నాలుగవ స్థానానికి రావడం ప్రజల నిర్లక్ష్యమే అని తెలిపాడు.

 

ప్రజల్లో మార్పు రాకపోతే ఈ కేసులు మరింత పెరుగుతాయని, కోటి మందికి కరోనా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని, కూరగాయలు కొన్నా, బయట తిరిగినా ఏం చేసినా కరోనా లేదనే అనుకుంటున్నాం. ఇలాంటి నిర్లక్ష్య ధోరణీ వీడితేనే కరోనాని ఎదుర్కోగలం అని చెప్పాడు. ప్రస్తుతం తేజ తన సినిమాల్లో నటించేవారికోసం ఆన్ లైన్ ఆడిషన్ ని నిర్వహించే పనిలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: