పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2 సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయంలో తన పూర్తి సమయాన్ని కేటాయిస్తూ ప్రజల సమస్యలపై పోరాడుతున్నాడు. గెలుపోటములు జీవితంలో ఒక భాగమని భావించిన పవన్ కళ్యాణ్ ప్రజలకు నాయకుడు అయినందుకు తన వంతు పోరాటం చేస్తున్నాడు. జనసేన పార్టీని ముందుకు నడిపించాలంటే డబ్బులు అవసరం కాబట్టి మళ్లీ రెండు సంవత్సరాల తర్వాత మొహానికి మేకప్ వేసుకొని ప్రేక్షకుల ముందుకు రెడీ అయ్యాడు. 


మూడు సినిమాల్లో హీరోగా నటించేందుకు ఒప్పుకున్న తన రాజకీయ జీవితానికి సినీ జీవితానికి చాలా ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ని రూపొందించుకున్నాడు. ఆ ప్లాన్ ప్రకారం పింక్ రీమేక్ చిత్రమైన వకీల్ సాబ్ షూటింగ్ లో రోజూ మధ్యాహ్న వేళల్లో క్రమం తప్పకుండా పాల్గొని... రాత్రి వేళల్లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరూపాక్ష షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు. ఇలా పగలు రాత్రి చిత్ర షూటింగ్ లలో పాల్గొంటూనే ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల పై స్పందించి అతడిలో ఇంకా పట్టుదల, శక్తి తగ్గలేదని చెప్పకనే చెప్పాడు. 


30 రోజుల షూటింగ్ షెడ్యూల్ పూర్తవుతే వకీల్ సాబ్ సినిమా చిత్రీకరణ అంతా పూర్తవుతుంది అనగా భారత దేశంలో కరోనా వైరస్ ఉధృతి బీభత్సంగా పెరిగిపోయింది. దాంతో మన ప్రధాని మోడీ భారత దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయవలసిందిగా ఆదేశించాడు. కఠినమైన లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమవ్వడం తో నిత్యవసర, అత్యవసర సేవలు తప్ప మిగతా అన్ని రంగాలు స్తంభించిపోయాయి. వీటిలో సినిమారంగం కూడా ఉండడంతో సినిమా హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు, కార్మికులకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ సినిమాల కోసం, రాజకీయం రూపొందించుకున్న ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. దీంతో నాలుగు నెలల క్రితం పవన్ కళ్యాణ్ పగలు, రాత్రి కష్టపడ్డ శ్రమంతా ఒక్కసారిగా వృధా అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: