ఏ హీరోకైనా తమ కెరీర్లో వారి మనసుకు దగ్గరైన సినిమాలు కొన్ని ఉంటాయి. ఇవే సినిమాలు క్లాసిక్స్, బ్లాక్ బస్టర్స్, నటన పరంగా, ప్రేక్షకుల నుంచి వచ్చే గుర్తింపు.. ఇలా ఏదొక కేటగిరీలో వారి మనసులో మిగిలిపోతాయి. తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో కూడా ఇటువంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఆయన కెరీర్ తొలినాళ్లలో వచ్చిన ‘పున్నమినాగు’ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి పాత్రకు తగ్గట్టు ఆయన నటన ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమా విడుదలై నేటితో 40 ఏళ్లు పూర్తయ్యాయి.

IHG's “Punnami Naagu”! – Cinemacinemacinema

 

ఏవీఎం ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా 1980 జూన్ 13న విడుదలైంది. ఇనిస్టిట్యూట్ విద్యార్ధిగా చిరంజీవికి సినిమాల్లో అప్పటికి రెండేళ్ల అనుభవం. యువ నటుడిగా ఆయనకు సవాల్ విసిరే పాత్ర. పాము లక్షణాలున్న మనిషిగా ఆయన రెండు డిఫరెంట్ షేడ్స్ ను చూపించాలి. ఛాలెంజింగ్ గా ఉండే ఈ పాత్రను చిరంజీవి తన నటనతో ఆకట్టుకున్నారు.. ప్రేక్షకుల్ని మెప్పించారు. సినిమా క్లైమాక్స్ లో చిరంజీవి పాము అని తెలిసిన తర్వాత హీరో నరసింహరాజు పారిపోమ్మంటాడు. ఆ సమయంలో.. ‘ఎక్కడికి పోవాలి.. పోతే పుట్టలోకే పోవాలి’ అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తుంది.

IHG

 

సినిమాలో హీరో నరసింహారాజు అయినా సినిమాకు చిరంజీవి పాత్రే కీలకం. చక్రవర్తి సంగీతంలోని పాటలు హిట్టయ్యాయి. ‘పున్నమిరాత్రి.. పూవుల రాత్రి’ అనే పాట సూపర్ హిట్టయ్యింది. దర్శకుడు రాజశేఖర్ సినిమాను చాలా ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ‘హున్నిమియే రాత్రియాళి’ అనే కన్నడ సినిమాకు పున్నమినాగు రీమేక్. రతి అగ్నిహోత్రి నరసింహారాజుకు హీరోయిన్ గా నటించింది. అప్పట్లో విలన్ పాత్రలు వేస్తున్న చిరంజీవికి పున్నమినాగు లిఫ్ట్ ఇచ్చిందని చెప్పాలి. 6 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుందీ సినిమా.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: