2020 సంవత్సరం సినిమా పరిశ్రమకి మంచి శుభారంభాన్ని ఇచ్చిందని అందరూ ఆనందించారు. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఈ ఏడాది బాక్సాఫీసు బద్దలే అని ఫిక్స్ అయిపోయారు. కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడని అంటారు కదా. ఇక్కడ కూడా అలాగే జరిగింది. సంక్రాంతి సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయని ఆనందించామో లేదో సమ్మర్ మొత్తం కరోనా కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది.

 

మార్చ్ లో స్టార్ట్ అయిన కరోనా ఉధృతి రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో థియేటర్లన్నీ మూతబడ్డాయి. మళ్ళీ ఎప్పుడు తెరుచుకుంటాయనేది కన్ఫర్మ్ లేదు. మొన్నటికి మొన్న తెలంగాణ, ఆంధ్రా ప్రభుత్వాలు షూటింగులకి పర్మిషన్స్ ఇచ్చినప్పటికీ, థియేటర్లకి ఎప్పుడు అనుమతి ఇస్తాయనేది ఇంకా తెలియట్లేదు.  దీంతో రిలీజ్ కోసం రెడీ చేసిన సినిమా నిర్మాతలకి ఏం చేయాలో అర్థం కావట్లేదు.

IHG

అందుకే తమ సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఈ లాక్డౌన్ వల్ల సగం షూటింగ్ జరుపుకున్న సినిమాలకి ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే అయినా ఆల్రెడీ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని, ఏవేవో కారణాల వల్ల థియేటర్ రిలీజ్ కి నోచుకోని, ల్యాబ్ లోనే ఉండిపోయిన చిత్రాలకి అదృష్టం కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో కొత్త సినిమాలు లేక జనాలకి ఒకరకమైన విసుగు లాంటిది కలుగుతుంది.

IHG

అందరూ అని భాషల్ సినిమాలని, వెబ్ సిరీస్ లని చూడాలని అనుకోరు. అందుకే ఓటీటీ యాజమాన్యాలు ఆల్రెడీ ల్యాబ్ లో ఆగిపోయిన చిత్రాలని ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ విధంగా అటు నిర్మాతతో పాటు ఓటీటీ వారికి కూడా లాభమే, ఈ వరుసలో సత్యదేవ్  నటించిన 47 డేస్ ఓటీటీలో రిలీజ్ కానుంది. అలాగే అల్లరి నరేష్ నటించిన బంగారు బుల్లోడు కూడా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కానుంది. మొత్తానికి లాక్డౌన్ పుణ్యమా అని థియేటర్లో రిలీజ్ కాని సినిమాలని అదృష్టం కలిసి వచ్చినట్టే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: