టాలీవుడ్ లో కొందరు హీరోల సినిమాల విషయంలో అభిమానుల్లో అసహనం తీవ్రంగా ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఒకప్పుడు అగ్ర హీరోల సినిమాలు వస్తున్నాయి అనగానే చాలా మందికి ఒక రేంజ్ లో ఆసక్తి అనేది పైకి చెప్పకుండా ఉండేది. ఇక సినిమా విడుదల అవుతుంది అనగానే చాలా వరకు హాల్ కి పరుగులు తీసే పరిస్థితి కూడా ఉండేది అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం ఆ విధానం ఎక్కడా కనపడే అవకాశం లేదు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

అవును ఇప్పుడు సినిమాలు విడుదల అయినా సరే అభిమానులు పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. స్టార్ హీరోల సినిమాలే దీనికి కారణం అని అంటున్నారు. సినిమా విడుదల అవుతుంది అంటే ఎదురు చూసే పరిస్థితి నుంచి సినిమా విడుదల అవుతుంది అంటే చూద్దాం అనే దశకు వెళ్ళిపోయారు చాలా మంది. దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఇప్పుడు మాత్రం చాలా మంది చెప్పేది ఒకటే మాట. సినిమాను విడుదల చెయ్యాలి అంటే చాలా ఎదురు చూసే పరిస్థితి అభిమానులకు ఉంది అని ఈ విధానం ఎంత మాత్రం మంచిది కాదు అని అంటున్నారు. 

 

ఎప్పుడు సినిమా విడుదల అవుతుందో ఎన్నాళ్ళకు సినిమా విడుదల అవుతుందో కనీసం అంచనా వేయలేని పరిస్థితి లో ఇప్పుడు జనాలు ఉన్నారు అని అంటున్నారు. గతంలో ఏడాదికి స్టార్ హీరో నుంచి ఒక సినిమా అయినా వచ్చేది. ఇప్పుడు రెండేళ్లకు ఒక సినిమా రావడానికి కష్టంగా మారింది. ప్రభాస్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ అదే విధంగా మరో ఇద్దరు ముగ్గురు హీరోలు సినిమాలను ఏళ్ళకు ఏళ్ళు తీసుకుని విడుదల చేయడం అభిమానులకు చాలా చికాకుగా ఉంది అని అంటున్నారు. మరి ఇప్పుడు సినిమాలు ఎప్పుడు చేస్తారో...

మరింత సమాచారం తెలుసుకోండి: