టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలకు ఇప్పుడు హీరోయిన్ ల కొరత అనేది ఉన్న సంగతి తెలిసిందే. అగ్ర హీరోయిన్ లు చిన్న హీరోయిన్ లు చాలా మంది ఇప్పుడు సినిమాలలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా సరే హీరోలు మాత్రం చాలా వరకు లక్కీ అనే పేరు ఉన్న హీరోయిన్ లను మాత్రమే ఎంపిక చేసుకునే పరిస్థితి వచ్చింది. చివరికి హీరోయిన్ ఐటెం సాంగ్ చేస్తే ఆమె లక్కీ అని భావిస్తేనే వారిని సినిమాల్లోకి దాదాపుగా తీసుకుంటున్నారు అనే విషయం అర్ధమవుతుంది. తాజాగా ఒక వార్త టాలీవుడ్ లో వచ్చింది. 

 

ఎన్టీఆర్ తన సినిమా కు గతంలో తనతో హిట్ కొట్టిన హీరోయిన్ నే ఎంపిక చెయ్యాలి అని త్రివిక్రమ్  కి చెప్పాడు అని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. అదే విధంగా మహేష్ బాబు నుంచి కూడా అదే సమాధానం దర్శక నిర్మాతలకు వచ్చింది అని చెప్పవచ్చు. చాలా మంది స్టార్ హీరోలు ఇప్పుడు చాలా వరకు లక్కీ అనే బ్రాండ్ ఉంటే మాత్రమే సినిమాలను చేసే ప్రయత్నం చేస్తున్నారు అని హీరోయిన్ లు కూడా ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ కి లక్కీ హీరోయిన్ అదే విధంగా ఎన్టీఆర్ కి కూడా ఆమె లక్కీ హీరోయిన్. 

 

అల్లు అర్జున్ కి కూడా ఆమె లక్కీ హీరోయిన్. రష్మిక కూడా మహేష్ కి లక్కీ హీరోయిన్. ఎన్టీఆర్ కి కాజల్ లక్కీ హీరోయిన్. రామ్ చరణ్ కి సమంతా లక్కీ హీరోయిన్. అందుకే ఇప్పుడు వారినే తమ సినిమాల్లోకి తీసుకునే ఆలోచనలో స్టార్ హీరోలు ఉన్నారు అని అంటున్నారు జనాలు. దీనితోనే ఇప్పుడు హీరోయిన్ ల కొరత అనేది ఎక్కువగా ఉంది అని కొత్త హీరోయిన్ లతో చేయడం లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: