తెలుగు ఇండస్ట్రీలో "అలా మొదలైంది"  సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న  బ్యూటీ నిత్యామీనన్. ఆ సినిమా అనంతరం వరుసగా తెలుగు ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు వచ్చాయి. ఇక ఈమె నితిన్ సరసన ఇష్క్, గుండెజారి గల్లంతయింది, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, జబర్దస్త్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే సెగ, 180 వంటి సినిమాలు చేసింది. అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో ప్రత్యేక గుర్తింపు లభించుకుంది ఈ బ్యూటీ. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

She lies into the shadows, waiting to be found.... 👣 The First Look of #BreatheIntoTheShadows ! My very first !! 😊 new Series releasing July 10 on amazon Prime @primevideoin 🥳 👏 stay tuned for more info coming soooooon :)))) @breatheamazon @bachchan @theamitsadh @saiyami @ivikramix @mayankvsharma @abundantiaent

A post shared by Nithya Menen (@nithyamenen) on

 


తనకు నటించే పాత్ర నచ్చితే మాత్రం కచ్చితంగా ఆసక్తి చూపుతుంది. ఇక ఈ బ్యూటీ ఇప్పటివరకు సినిమాలకే అంకితమైన... తాజాగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా ఎంట్రీ ఇచ్చేసింది.  కొన్ని నెలల నుంచి నిత్యమీనన్ డిజిటల్ ఎంట్రీపై వార్తలు కూడా వచ్చాయి. అలాగే ఈ వార్తను నిజం చేస్తూ బాలీవుడ్ ప్రముఖ నటుడైన అభిషేక్ బచ్చన్ సరసన ‘బ్రీత్... ఇన్ టు ది షాడోస్’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇక ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతుంది. అలాగే ఈ వెబ్ సిరీస్ లో అమిత్ సాద్‌, స‌యామీఖేర్ కీలక పాత్రలో నటించడం జరిగింది. దీనితోపాటు రెండో సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను అభిషేక్ విడుదల చేయడం జరిగింది. రెండో సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో జులై 10 నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

 


ఈ సందర్భంగా వెబ్ సిరీస్ పై నిత్యా మీనన్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఇన్స్టాగ్రామ్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అలాగే వెబ్ సిరీస్ ద్వారా అందరినీ పలకరించడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ నిత్యామీనన్ తెలియజేసింది. ఇక ఇటీవల ఈ బ్యూటీ " మిషన్ మంగళ్‌యాన్" అనే సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అలాగే తాజాగా జయలలిత బయోపిక్ లో కూడా ఈమె నటిస్తున్నారు. ఇక ఐరన్ లేడీ పేరుతో రూపొందబోతున్న ఒక సినిమాలో కూడా నిత్య జయలలిత పాత్ర చేస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: