దేశం లో లాక్ డౌన్ నడుస్తుండటంతో సినిమా థియేటర్ ల వ్యాపారం డేంజర్ జోన్ లో పడిపోయింది. ఒక పక్క చూస్తే రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఊహించని రీతిలో నమోదవుతున్నాయి. మరోపక్క కేంద్ర ప్రభుత్వం కూడా మరొకసారి సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయడానికి రెడీగా ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సినిమా షూటింగ్ లను పూర్తి చేసుకొని ఉన్నా ప్రొడ్యూసర్ లకి OTT ఒకటే మార్గం గా కనబడుతోంది. మొన్నటి వరకు థియేటర్ల ద్వారానే విడుదల చేద్దామని కంకణం కట్టుకున్న సినిమా ప్రొడ్యూసర్ లు.. దేశంలో కరోనా వైరస్ సృష్టిస్తున్న విధ్వంసానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు OTT ఒకటే ఆప్షనల్ కింగ్ గా మారింది.

IHG

దీంతో ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త సినిమాల నిర్మాతలు స్ట్రైట్ గా OTT ప్లాట్ ఫామ్ లో సినిమాలు రిలీజ్ చేయటానికి మెల్లమెల్లగా రెడీ అవుతున్నారు. ఇప్పటికే ‘అమృతారామ్’ అనే చిన్న సినిమాని ఓటీటీ..రిలీజ్ చేయడం జరిగింది. తాజాగా సత్యదేవ్ కీలక పాత్రలో నటించిన 'ఉమా మహేశ్వరరావు ఉగ్ర‌రూప‌స్య' అనే సినిమాని నెట్ ఫ్లిక్స్‌లోకి విడుదల చేయటానికి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని అఫిషియల్ గానే ప్రకటించడం జరిగింది. కానీ ఇంకా రిలీజ్ డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు.

IHG

ఇదే టైంలో సత్యదేవ హీరోగా ప్ర‌దీప్ మ‌ద్దాలి అనే నూతన డైరెక్టర్ రూపొందించిన హర్రర్ థ్రిల్లర్ మూవీ '47 డేస్' త్వ‌ర‌లోనే జీ5లో రిలీజ్ కానుంది. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న కూడా చేశారు. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌నున్నారు. దాదాపు ఏడాది కింద‌టే ఈ చిత్రం పూర్త‌యింది. అప్పట్లో రిలీజ్ టైమ్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే తాజాగా ఓటీటీ తద్వారా ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. చాలా వరకు థియేటర్లలో రిలీజ్ కావాల్సిన సినిమాలు ఓటీటీ లో విడుదల చేయటానికి ప్రస్తుతం నిర్మాతలు ఒక్కొక్కరూ ముందుకు రావడంతో ఓటీటీ నిర్మాతల పాలిట కింగ్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: