హీరోయిన్లకు లాంగ్ కెరీర్ ఉండాలంటే అందంతోపాటు నటన ఉండాలి. ఇవి రెండూ ఉన్న వారికి హీరోయిన్ గా రాణించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పుష్కలంగా ఉన్న హీరోయిన్ త్రిష. హీరోయిన్ గా తెరంగేట్రం చేసి 17ఏళ్లు అయినా ఇప్పటికీ హీరోయిన్ అవకాశాలు వస్తున్నాయంటే త్రిష అందం, నటన ప్రత్యేకమనే చెప్పాలి. గ్లామర్ క్వీన్ గా రెండు భాషల్లోనూ తిరుగులేకుండా ఏలేసింది. త్రిషలో ఉన్న అందానికి గ్లామర్ డ్రస్సుల్లో తన అందం మరింత ద్విగుణీకృతమవుతుంది. ఇందుకు తను చేసిన క్యారెక్టర్లే ఉదాహరణ.

IHG

 

మోడ్రన్ డ్రస్సులైనా, లంగా ఓణీ అయినా, చీరలో అయినా త్రిష కపినించే అందానికి తెలుగు, తమిళ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఎన్నో సినిమాల్లో గ్లామర్ డ్రస్సులేసినా చిరంజీవితో చేసిన స్టాలిన్ లో త్రిష అందం మరింతగా కనిపిస్తుంది. మోడ్రన్ డ్రెస్సులు, పోనీ టెయిల్, షార్ట్ హెయిర్ లో సినిమా అంతా బబ్లీగానే కనిపిస్తుంది. మహేశ్ తో చేసిన అతడులో లంగా ఓణీలో అచ్చం తెలుగింటి అమ్మాయిగా మెప్పించింది. సినిమా అంతా అదే మేకోవర్ లో ఎంతో అందంగా కనిపించింది. వెంకటేశ్ తో చేసిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలో మోడ్రన్ డ్రెస్సులతో పాటు చీరలో కూడా కనిపించి సంప్రదాయ కట్టులో తాను ఎంత అందంగా ఉంటుందో నిరూపించింది.

IHG

 

ఇవే కాకుండా ఎన్నో సినిమాల్లో తన అందంతో ఆకట్టుకుంది. సెమీ స్విమ్ సూట్స్ లో కూడా అలరించింది త్రిష. కృష్ణ, నాయకి వంటి సినిమాల్లో ఇటువంటి ఔట్ ఫిట్స్ లో కనిపించి ఆకట్టుకుంది. కొందరు హీరోయిన్లు గ్లామర్ డ్రెస్సుల్లోనే అందంగా కనిపిస్తారు. మరికొందరు సంప్రదాయ దుస్తుల్లోనే నప్పుతారు. కానీ.. త్రిష అన్ని రకాల ఔట్ ఫిట్స్ లో చక్కగా సూటవుతుంది. ఇందుకు తన లాంగ్ కెరీర్లో చేసిన సినిమాలే ఉదాహరణగా నిలిచాయి.

IHG

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: