ఇప్పటివరకు పరాజయం అన్నపదం తెలియని రాజమౌళికి ఒక భయం ఉంది రాజమౌళి తనకు ఎన్ని మొహమాటాలు ఎదురైనా ఒక కొత్త హీరోని పరిచయం చేయడానికి పెద్దగా ఇష్టపడడు. స్టార్ హీరోల వారసులను పరిచయం చేయమని అత్యంత భారీ పారితోషికాలు ఆఫర్ చేసినా జక్కన్న పట్టించుకోడు.


గతంలో నాగార్జున అఖిల్ మొట్టమొదటి సినిమా రాజమౌళితో చేయించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజమౌళి స్పందించలేదు అన్న వార్తలు ఉన్నాయి. ‘మగధీర’ తో రామ్ చరణ్ కు స్టార్ హీరో ఇమేజ్ ని తెచ్చిపెట్టిన రాజమౌళి మొదట్లో చరణ్ పేరు చెపితే భయపడిపోయాడట. చరణ్ హీరో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్న పరిస్థితులలో అప్పట్లో చిరంజీవి రాజమౌళి చేత చరణ్ మొదటి సినిమాను దర్శకత్వం వహింపచేయడానికి చాలగట్టి ప్రయత్నాలు చేసాడట.


అయితే రాజమౌళి మాత్రం చిరంజీవి రాయబారాలకు స్పందించకుండా అప్పట్లో తప్పించుకుని తిరిగాడట. దీనితో మరొమార్గం లేక చిరంజీవి పూరి జగన్నాథ్ తో చరణ్ మొదటి సినిమాను ఒకే చేయడంతో అది ‘చిరుత’ గా మారిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆసినిమా అప్పట్లో అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోయినా ఆమూవీలో చరణ్ నటనను చూసి ఇష్టపడ్డ రాజమౌళి ఆతరువాత అల్లు అరవింద్ రాయబారాలకు స్పందించి చరణ్ తో ‘మగధీర’ ను తీసి ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసాడు.


అదేవిధంగా రాజమౌళికి అత్యంత సన్నిహితుడైన జూనియర్ విషయంలో కూడ జరిగింది. వాస్తవానికి జూనియర్ హీరోగా పరిచయం కాబడ్డ మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’ కి దర్శకత్వం వహించింది వి.ఆర్ ప్రతాప్. ఆసినిమా పెద్ద విజయం సాధించలేదు. అప్పటి వరకు బుల్లితెర సీరియల్స్ కు దర్శకత్వం వహిస్తున్న రాజమౌళి తన మొదటి సినిమా జూనియర్ తో ‘స్టూడెంట్ నెంబర్ వన్’ తీస్తున్నప్పుడు తాను ఇంత లావుగా ఉన్న హీరోతో సినిమా తీస్తున్నాను ఏమిటి అంటూ తెగబాధ పడేవాడట. అయితే ఆతరువాత ఆసినిమా ఘనవిజయం సాధించి జూనియర్ తో పాటు రాజమౌళి కెరియర్ కు కూడ బ్రేక్ రావడంతో ఆతరువాత రాజమౌళి జూనియర్ లు ప్రాణస్నేహితులుగా మారిపోయారు. అలాంటి రాజమౌళి ప్రస్తుతం యాధృశ్చికంగా తాను గతంలో దర్శకత్వం వహించడానికి నిరాకరించిన హీరోలతో ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ వీరిద్దరిని కలిపితీయడం చూసినవారికి షాకింగ్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: