రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్న ఈ సినిమా నుండి ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

 

 

అల్లూరి సీతారామరజుగా రామ్ చరణ్ ని పరిచయం చేసిన రాజమౌళి, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ని ఎప్పుడు పరిచయం చేయబోతున్నాడా అని ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజున విడుదల కావాల్సిన ఈ ఫస్ట్ లుక్ కరోనా కారణంగా వాయిదా పడింది. మరికొద్ది రోజుల్లోనే కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ రివీల్ కానుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది.

 

 


కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నిజాం నవాబుతో ఫైట్ చేసే సన్నివేశాలు గూస్ బమ్స్ తెప్పిస్తాయట. అలాగే పులితో ఫైట్ చేసే సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండనుందట. అంతే కాదు ఎన్టీఆర్ తెలంగాణ మాండలికంలో మాట్లాడే డైలాగులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. రాజమౌళి ఈ విషయంలో చాలా శ్రద్ధ చూపాడని అంటున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ ఫస్ట్ లుక్ లో వినబడిన మాటలు ఎంతలా మెప్పించాయో తెలిసిందే.

 

 


అంతే కాకుండా బ్రిటన్ భామ ఒలివియా మోరిస్ తో లవ్  సీన్స్ ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నాయట. ఎన్టీఆర్, ఒలివియా మధ్య అసలు మాటలే ఉండవట. కేవలం చూపుల ద్వారానే వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ జరుగుతుందట. ఇన్ని క్రేజీ అంశాలున్నా ఈ పాత్ర ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో..! ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: