ఈ మధ్య కాలంలో ఒక సినిమాలోని అన్ని పాటలకి ఒకే రకమైన రెస్పాన్స్ వచ్చిందంటే, అది ఒక్క అలవైకుంఠపురములో సినిమాకి మాత్రమే అని చెప్పవచ్చు. థమన్ స్వరపరిచిన అన్ని పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. యూట్యూబ్ లో వన్ బిలియన్ వ్యూస్ దక్కించుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఈ సినిమా విజయంలో పాటల పాళ్ళు చాలా ఎక్కువే ఉన్నాయని చెప్పిన అతిశయోక్తి కాదు.

 

 

సామజవరగమనా నుండి మొదలైన ప్రభంజనం సిత్తరాల సిరపడు అనే పాటవరకి కొనసాగుతూనే ఉంది. ఒకదానిని మించి మరొకటి అన్నట్లుగా సూపర్ హిట్ అయ్యాయి. కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు, భాషాభేధం లేకుండా అన్ని భాషల వారు ఆదరిస్తున్నారు. అంతే కాదు తమ తమ భాషల్లో ఈ పాటలకి మాటలు కూర్చుకుని మరీ పాడుకుంటున్నారు. ఇక టిక్ టాక్ లో అయితే వేరే చెప్పేదేముంది.

 

 

టాలీవుడ్ నుండి మొదలుకుని బాలీవుడ్, కొలీవుడ్, అంతేకాక ఆస్ట్రేలియా క్రికెట్ క్రీడాకారుడైన డేవిడ్ వార్నర్ సైతం అల వైకుంఠపురములో పాటలకి స్టెప్పులేశారు. బుట్టబొమ్మ, రాములో రాములా పాటలు టిక్ టాక్ లో వైరల్ అయ్యాయి. టిక్ టాక్ ద్వారా ఈ పాటలకి స్టెప్పులేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సినిమా వచ్చి ఐదు నెలలు అవుతున్నా ఆ పాటల ప్రభంజనం మాత్రం ఇంకా తగ్గలేదు. 

 

 

తాజాగా చిరంజీవి మనవరాలు బన్నీ పాటకి స్టెప్పులేసింది. రాములో రాములా పాటకి బన్నీ ఎలా స్టెప్పులేసాడో అనుకరిస్తూ చేసిన ఈ వీడియోని చిరంజీవి కూతురు శ్రీజ  సోషల్ మీడియాలో షేర్ చేసింది. మొత్తానికి అల వైకుంఠపురములో పాటలు చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరినీ ఆకర్షిస్తూనే ఉన్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డుని క్రియేట్ చేసింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#RamuloRamula @navishka_k . . #NavishkaDances #SreejaKalyanBaby

A post shared by sreeja Kanuganti (@sreeja_kalyan) on

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: