మాస్ రాజా రవితేజ, యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం క్రాక్. ఇటీవల విడుదలైన టీజర్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక మే 8న ఈసినిమా విడుదలకావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదాపడింది అయితే కొన్ని రోజుల నుండి ఈ సినిమా డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి దీనిపై తాజాగా గోపిచంద్ మలినేని క్లారిటీ ఇచ్చాడు.
 
క్రాక్ మాస్ సినిమా.. వెండితెర పై చూడాల్సిన సినిమా.. కరోనా  భయంవున్న జనాలు థియేటర్లకు వస్తారన్న నమ్మకం వుంది సినిమాను థియేటర్లో విడుదలచేస్తాం అంటూ తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పొకొచ్చాడు అలాగే మరో 10-15షూటింగ్ బ్యాలెన్స్ ఉందని జులై మొదటి వారంలో పభుత్వం విడుదలచేసిన మార్గదర్శకాలను పాటిస్తూ షూటింగ్ చేస్తామని  గోపిచంద్ పేర్కొన్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో కనిపించనుంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు.
 
కాగా గోపిచంద్ తో రవితేజ ఇంతకుముందు డాన్ శీను , బలుపు అనే సినిమాలు చేయగా  డాన్ శీను యావరేజ్ అనిపించుకోగా బలుపు సూపర్ హిట్ అయ్యింది. మరి క్రాక్ ఎలాంటి  ఇస్తుందో చూడాలి. ఇక ఈసినిమా తరువాత రవితేజ ,రమేష్ వర్మ తో సినిమా ను మొదలు పెట్టనున్నాడు. వీర తరువాత  వీరికాంబినేషన్ లోఇది రెండో సినిమా. త్వరలోనే ఈ సినిమా లాంచ్ కానుంది. కోనేరు సత్యనారాయణ, హవీష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈసినిమా తరువాత రవితేజ, వక్కంతం వంశీ ,త్రినాథ రావు నక్కిన తో సినిమాలు చేయాల్సి వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: