చాలామందికి తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, హలో, టిక్ టాక్.. వేదికలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. దీంతో కొత్త కొత్త క్రియేటివిటీ థాట్స్ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడలాంటి ఓ క్రియేటర్ క్యాడ్బరీ చాక్లెట్ యాడ్ ను తన క్రియేటివిటీతో ప్రభాస్ మీద ప్రయోగించాడు. ఇందుకు బాహుబలి2 సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఉపయోగించుకున్నాడు. ఈ యాడ్ ఎడిట్ ను టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

IHG

 

బాహుబలి2లో అత్యంత కీలకమైన సన్నివేశం.. రానా పట్టాభిషేకం. ఈ సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అక్కడ ప్రభాస్ సర్వ సైన్యాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తాడు. ఆ సన్నివేశంలో తీసిన షాట్స్ ను ‘క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్’ యాడ్ సాంగ్ ను మిక్స్ చేశాడో నెటిజన్. సినిమాలోని సన్నివేశాలను క్యాడ్బరీ జింగిల్ కి తగ్గట్టుగా ఎడిట్ చేసి యూట్యూబ్ లో వదిలాడు ఓ టాలెంటెడ్ క్రియేటర్. జింగిల్ లో ఉన్న స్లోనెస్ కి పట్టాభిషేకంలో ప్రభాస్ డైలాగ్స్, సన్నివేశాలు సరిగ్గా సరిపోయాయి. నిజంగా ఈ వీడియోలో ప్రభాస్ లిప్ మూమెంట్స్ కి మిగిలిన నటుల ఎక్స్ ప్రెషన్స్  ఎడిట్ సరిగ్గా సరిపోయాయి.

IHG

 

ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతోంది. మంచు మనోజ్ షేర్ చేయడంలో ఇది మరింత ట్రెండ్ అవుతోంది. క్రియేటివిటీకి హద్దులు లేవంటూనే దీనిని అద్భుతమని పొగిడాడు మనోజ్. దీనికి నెటిజన్ల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ‘బెస్ట్ ఎడిట్’, ‘క్రియేటివిటీ పీక్స్’, ‘మీ సెన్సాఫ్ హ్యూమర్ అదుర్స్’,.. అంటూ నెటిజన్లు అద్భుత రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇటువంటి క్రియేషన్స్ తో తమ టాలెంట్ తో ఎంతోమంది సందడి చేయడం విశేషమనే చెప్పాలి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Awesome edit 🔥🔥🔥 Epic sync 👌👌👌 hollywood rebel star 🤗🤗🤗 @actorprabhas

A post shared by Manoj Kumar Manchu (@manojkmanchu) on

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: