ప్రయోగాలు చేస్తూ.. పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, కమర్షియల్ గా మాత్రం సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. అన్నీ సినిమాల్లాగే తన అప్ కమింగ్ ఫిల్మ్ విషయంలోనూ సూర్యను ఆకాశానికెత్తేస్తున్నారు. 

 

సినిమా ఏదైనా.. క్యారెక్టర్ ఎలా ఉన్నా.. దానికి సూర్య యాక్టింగ్ తోడైతే మాత్రం మరోలా ఉంటుంది. సినిమా, సినిమాకు  వైవిధ్యం ప్రదర్శిస్తున్న సూర్య.. తన పర్ ఫామెన్స్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాడు. కానీ అలాంటి ఎక్స్ పెరిమెంటల్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. దాంతో సూర్యకు నటన పరంగా ప్రశంసలు మిగులుతున్నాయి తప్పా.. హిట్ అందుకోలేకపోతున్నాడు. 

 

కొంతకాలంగా సరైన సక్సెస్ లేని సూర్య.. తన లేటెస్ట్ ఫిల్మ్ ఆకాశం నీ హద్దురా.. పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా విషయంలోనూ.. నటనా పరంగా సూర్య అదరగొట్టాడని వినిపిస్తోంది. సుధాకొంగర దర్శకత్వంలో ఎప్పుడో షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. కరోనా కారణంగా విడుదల కాలేదు. కానీ ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది. దీనికి సెన్సార్ బోర్డ్ క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది. 

 

ఆకాశం నీ హద్దురా.. సినిమా చూసిన సెన్సార్ సభ్యులకు.. సూర్య నటన ఎంతగానో ఆకట్టుకుందట. ఈ సినిమాలో సూర్య నటన చాలా బావుందని.. తన యాక్టింగ్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ ను అభినందించారట. 

 

ఎయిర్ డెక్కన్ ఫౌండర్, గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తుండగా.. మోహన్ బాబుకి కీలక పాత్రలో నటిస్తున్నారు. థియేటర్లు తెరుచుకోగానే ఈ మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి నటనా పరంగా మరోసారి ఇంప్రెస్ చేసిన సూర్యకు.. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: