44 ఏళ్ల బాలీవుడ్ నటి సుస్మితాసేన్ రోహ్మాన్‌ షాల్‌ అనే 29 ఏళ్ల యువకుడితో ఒకటిన్నర సంవత్సరాల నుండి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుంది. ఐతే వీళ్ళిద్దరూ ఇంస్టాగ్రామ్ లో డైరెక్ట్ మెసేజ్ లు పంపకుంటూ పరిచయం పెంచుకున్నారు. తదనంతరం అతడిని వయసు అడగకుండానే సుస్మితాసేన్‌ పీకల్లోతు ప్రేమలో మునిగింది. ఏదో ఒక సందర్భంలో నీ వయసు ఎంత అని రోహ్మాన్‌ షాల్‌ ని అడిగినప్పుడు అతడు మాత్రం సమాధానం చెప్పకుండా ఆమె దృష్టి మరల్చేవాడట. అయితే ఒకానొక సందర్భంలో తప్పక తన వయసు 29 సంవత్సరాలు అని చెప్పగా ఆమె ఒక్క సారిగా షాక్ అయిందట. ఆ తర్వాత తేరుకొని ప్రేమకు వయసు అడ్డు రాకూడదు. మన ఇద్దరిదీ వయో భేదాలు లేని స్వచ్ఛమైన ప్రేమ అంటూ అతడితో తన లవ్ ట్రాక్ కొనసాగిస్తూ ఉందట. 

IHG'He Hid His Age Initially'
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన డేటింగ్ విషయాల గురించి మాట్లాడుతూ... రోహ్మాన్‌ షాల్‌ చాలా మంచివాడు. అతనిలో ఆ మంచితనం, దయా గుణాలు నాకు బాగా నచ్చుతాయి. మిమిద్దరం కలవాలని ఆ దేవుడు నిశ్చయించాడు. అతను నాకంటే వయసు తక్కువే ఉంటుందని నాకు తెలుసు కానీ ఎంత వయస్సు అనేది ఖచ్చితంగా తెలియలేదు. నీ వయసెంత అని అడిగినప్పుడు తాను 29 అని చెప్పాడు కానీ అప్పుడు మేము మాట్లాడిన సంభాషణలో ఎక్కువగా వయసు గురించి మాట్లాడలేదు. కానీ ఒకరోజు తను నాకు ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్ లో తాను రాసిన పదాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. వెంటనే థాంక్యూ అని రిప్లై పంపాను. ఆ రోజు నుంచి మా ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతూ పోయి ప్రియమైన ప్రేమ పుట్టుకొచ్చింది', అని ఆమె చెప్పుకొచ్చింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

“Here’s another beautiful reason to smile more often” 😉😁❤️😍 I love you @rohmanshawl #dimples #toocute 😍💋 #Repost @rohmanshawl with @make_repost ・・・ I just love her dimples 😍❤️😘 My munchkin ❤️😘 @sushmitasen47 I love YOU #love #life #happiness #smile #mine

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

ప్రస్తుతం సుస్మితాసేన్ దత్త పుత్రికలతో పాటు రోహ్మాన్‌ షాల్‌ తో కలిసి సరదాగా సమయం గడుపుతోంది. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని తెలుస్తుంది. మంచి ముహూర్తం చూసుకొని వీళ్లిద్దరు భార్యాభర్తలు కావాలని వేచి చూస్తున్నారట. ఏదిఏమైనా సుస్మితాసేన్‌ తన కంటే 15 ఏళ్లు వయసు తక్కువ ఉన్న యువకుడిని గాఢంగా ప్రేమిస్తూ పెళ్లికి సిద్ధమవడం ప్రస్తుతం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: