బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది.  ఇప్పటికే ప్రముఖ నటులు ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ లాంటి దిగ్గజ నటులు మృతి చెందిన తర్వాత పలువురు సినీ, ఇతర రంగాల కు చెందిన వారు కన్నుమూశారు.  ఈ మద్య కన్నడ నటుడు చిరంజీవి సర్జా కన్ను మూసిన విషయం తెలిసిందే. తాజాగా 'ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్' చిత్రం ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఎవరూ ఊహించని విధంగా ముంబయిలోని తన నివాసంలో బలవన్మరణం చెందినట్టు గుర్తించారు. లాక్ డౌన్ నేపథ్యంలో బాంద్రాలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నాడు. 

IHG

కొన్నిరోజులుగా అతని పరిస్థితి ఏమీ బాగాలేదని, ఉరేసుకుని చనిపోయినట్టు భావిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వయసు 34 సంవత్సరాలు. 'కై పో చే' అనే చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ చివరి చిత్రం 'చిచ్చోర్'.

IHG

కాాగా, పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియా కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటన జరిగిన కొన్నాళ్లకే సుశాంత్ ఈ లోకాన్ని విడిచివెళ్లడం బాధాకరం. చిన్న వయసులు మంచి కెరీర్ ఉన్న సమయంలో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాలు కన్నీరు మున్నీరు అవుతున్నారు.  పలువురు స్టార్లు తమ సోషల్ మాద్యమాల ద్వారా  కన్నీటి వీడ్కోలు తెలుపుతున్నారు.  ఈ మద్య బాలీవుడ్ ఏం శాపం చేసుకుందో ఇలా మంచి మంచి నటులు అందరూ చనిపోతున్నారని బాధపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: