'లెజెండ్' సినిమా తర్వాత బాలయ్య బాబు నటించిన సినిమా ఏదీ కూడా నందమూరి అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రకు సంబంధించి బయోపిక్ రెండు సినిమాలు 'రూలర్' ఇలా వచ్చిన సినిమాలు చాలా వరకూ బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడ్డాయి. ముఖ్యంగా 2019 ఎలక్షన్ సమయంలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు ఫ్లాప్ అవడంతో టిడిపి పార్టీకి భారీగా దెబ్బ పడింది అని చాలామంది అంటారు. ఒకపక్క హీరోగా మరో పక్క రాజకీయ నేతగా రెండు రంగాలలో తండ్రి ఎన్టీఆర్ మాదిరిగా విజయవంతంగా రాణిస్తున్న బాలయ్య బాబు కి గత కొన్ని సంవత్సరాల నుండి బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్ పడకపోవడంతో ఫుల్ నిరుత్సాహంలో ఉన్నారు నందమూరి ఫ్యాన్స్.

IHG

ఇటువంటి సమయంలో బాలయ్య బాబు తో బోయపాటి సినిమా చేయడంతో కొద్దిగా ఊపిరిపీల్చుకున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'సింహా' మరియు 'లెజెండ్' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మరియు బాలయ్య బాబు కెరీర్ లోనే ది బిగ్గెస్ట్ సూపర్ హిట్ సినిమాలు గా నిలిచాయి. ప్రస్తుతం మూడో సినిమా రాబోతున్న తరుణంలో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే బాలయ్య బాబు పుట్టినరోజు నాడు BB3 పేరిట రిలీజ్ అయిన వీడియో సోషల్ మీడియాలో అదిరిపోయే రికార్డులను సాధిస్తోంది.

IHG

రిలీజైన వీడియో లో బాలయ్య బాబు చెప్పిన డైలాగ్ లు మరియు బోయపాటి చూపించిన విధానం బాగా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు సినిమా కోసం ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు. దీంతో బాలయ్య బాబు మరియు బోయపాటి దర్శకత్వంలో రాబోయే మూడవ సినిమా కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతోందని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. అంతే కాకుండా సినిమాకి సంబంధించి విడుదలైన వీడియో ఇంకా TOP ట్రెండింగ్ గా కొనసాగడంతో బాలయ్య బోయపాటి సినిమా కోసం బాలయ్య అభిమానులు మంచి ఆకలి మీద ఉన్నట్లు అర్థమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: