దేశంలో కరోనా తో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలిసిందే. అయితే ఇదే సమయంలో బాలీవుడ్ లో వరుస విషాదాలు కూడా కన్నీరు పెట్టిస్తున్నాయి.  ఇప్పటికే ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ లాంటి నటులు కన్ను మూశారు. ఇక  'కిస్ దేశ్ మే హై మేరా దిల్' అనే టీవీ సీరియల్‌తో బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ తన  నటనా జీవితం ప్రారంభమైంది.  టీవీ నటుడుగా కెరీర్‌ ప్రారంభించిన సుశాంత్  వెండితెరపై తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తన అద్భుత నటనతో అతి తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. 

 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వయసు 34 సంవత్సరాలు. 'కై పో చే' అనే చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ చివరి మూవీ 'డ్రైవ్'. దిల్ బేచారా అనే చిత్రం విడుదల కావాల్సి ఉంది.  తర్వాత ధోనీ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌.  ఆ సినిమా కోసం సుశాంత్‌ చాలా కష్టపడ్డాడు. ధోనీ హెలికాప్టర్‌ షాట్‌ కోసం సుశాంత్‌ ఎంతో శ్రమించాడు. ఆ తర్వాత కేదార్‌నాథ్, చిచోరే లాంటి కమర్షియల్ సినిమాలు కూడా చేసి ప్రేక్షకుల ఆదరణ పొందాడు.  బాంద్రాలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నాడు.

 

కొన్నిరోజులుగా అతని పరిస్థితి ఏమీ బాగాలేదని, ఉరేసుకుని చనిపోయినట్టు భావిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే సుశాంత్‌ సింగ్‌ జూన్‌ 3న చివరి సారిగా తన తల్లిపై ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన కవితాత్మక పోస్ట్‌ అందరినీ కంటతడి పెట్టిస్తోంది.  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన తల్లిని గుర్తు చేసుకుంటూ పెట్టిన పోస్ట్  సోషల్ మీడియాలో అందరినీ కన్నీరు పెట్టిస్తుంది. 'మసకబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది. అనంతమైన కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్యా బతుకుతున్నా' అని పోస్టులో రాశారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Blurred past evaporating from teardrops Unending dreams carving an arc of smile And a fleeting life, negotiating between the two... #माँ ❤️

A post shared by sushant singh Rajput (@sushantsinghrajput) on

మరింత సమాచారం తెలుసుకోండి: