బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్త బాలీవుడ్ ను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఎంతో భవిష్యత్ ఉందని భావిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.  బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆకస్మిక మరణం పట్ల ప్రధాని నరేంద్రమోదీ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుశాంత్‌ మృతికి సంతాపం ప్రకటిస్తూ..మోదీ ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టారు. టీవీ సీరియళ్లు, సినిమాల్లో సుశాంత్‌ అద్భుతంగా నటించేవాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో సుశాంత్‌ సింగ్‌ ఎంతోమందికి స్పూర్తి. సుశాంత్ జ్ఞాపకార్థంగా నిలిచిపోయే ఎన్నో ప్రదర్శనలు వదిలివెళ్లాడు.కుటుంబసభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

 

 సుశాంత్ మ‌ర‌ణం నిజంగా దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ ట్వీట్ చేశారు. మ‌న మాన‌సిక స్థితి స‌మంగా ఉండే విధంగా చూసుకోవాల‌ని మంత్రి గోయ‌ల్ త‌న ట్వీట్‌లో అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌నం ఇష్ట‌ప‌డేవారికి మ‌న మాన‌సిక స్థితి గురించి వెల్ల‌డించేందుకు ఎప్పుడూ వెన‌కాడ‌కూడ‌ద‌ని గోయ‌ల్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.    టీమిండియా మాజీ క్రికెట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ కూడా త‌న ట్విట్ట‌ర్‌లో హీరో సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌పై స్పందించాడు. 

 

మాన‌సిక ఆరోగ్యం అనేది చాలా సీరియ‌స్ ఇష్యూ అని క్రికెట‌ర్ ల‌క్ష్మ‌ణ్ అన్నాడు. మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించేందుకు ఇది చాలా ముఖ్య‌మ‌న్నాడు. సుశాంత్ ఫ్యామిలీకి లక్ష్మ‌ణ్ సంతాపం తెలిపాడు. ఇక అందమైన సుశాంత్ జీవితంలో ఈ మద్య విషాదాలు బాగానే చోటు చేసుకున్నాయి.  ఆయన ఎంతో నమ్మకంగా చూసే అతని మేనేజర్ దిశ 14వ అంత‌స్తు నుంచి దూకి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. అయితే ఆమె మ‌ర‌ణంపై కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఫుల్‌గా తాగి బిల్డింగ్ మీద నుంచి దూకిన‌ట్లు పోలీసు విచార‌ణ‌లో తేలిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది. అప్పటి నుంచి మానసికంగా బాధపడుతున్నట్లే సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: