టాలీవుడ్ లో రాజమౌళి గురించి చెప్పాలంటే బాహుబలి కి ముందు బాహుబలి కి తర్వాత అని చెప్పాలి. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ ఘనతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. అప్పటి వరకు 50-70 కోట్లు పెట్టి సినిమాని నిర్మించే వాళ్ళకి ఈ సినిమా పెద్ద షాకిచ్చింది. రెండు భాగాలకి దాదాపు 400 కోట్ల కి పైగా బడ్జెట్ ని కేటాయించి బాహుబలి ఫ్రాంఛైజీని రూపొందించారు. 200 కోట్ల తో బాహుబలి బిగినింగ్ ..దాదాపు 250 కోట్లతో బాహుబలి కన్‌క్లూజన్ ని రూపొందించారు జక్కన్న. చెప్పాలంటే ఇంత బడ్జెట్ తో అంతక ముందు ఏ సినిమాని నిర్మించలేదు.

 

దాంతో బాహుబలి సినిమా మొత్తం సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రిలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఒక పార్ట్ గా అనుకున్న ఈ సినిమా రెండు భాగాలుగా తీయడం కూడా సంచలనం అయింది. ఇక ఈ రెండు భాగాలకి కలిపి 1800 కోట్ల కి పైగా వసూళ్ళని రాబట్టి హాలీవుడ్ మేకర్స్ ని సైతం అవాక్కయ్యోలా చేసింది. ఇంతటి ఘనత కి కారణం రాజమౌళి అన్న పేరు దేశమంతటా మార్మోగిపోయింది. ఆ తర్వాత నుంచి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారడమే కాదు ప్రభాస్ తో సినిమా అంటే కనీసం 200 కోట్లకి పైగా బడ్జెట్ ఉండాలన్న లెక్కలు వచ్చాయి. కాని సాహో ఇచ్చిన షాక్ తో కాస్త జాగ్రత్త పడ్డ టాలీవుడ్ మేకర్స్ కి కరోనా జీవితం అంటే ఏంటో తెలిపింది. 

 

అంతేకాదు ఇష్టానుసారంగా బడ్జెట్ పెట్టి సినిమా తీసి లెక్కల్లో అంకెలు మార్చేసే ప్రతీ మేకర్ కి భయాన్ని పుట్టించింది. చెప్పాలంటే డబ్బు విలువ తెలిసేలా చేసింది. ఇక బాహుబలి తర్వాత ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ని మొదలు పెట్టారు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ .. మెగా పవర్ స్టార్ రాం చరణ్ లతో దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని మొదలు పెట్టి కొంత భాగం చిత్రీకరణ జరిపారు.

 

ఆ తర్వాత నుంచి ఆర్.ఆర్.ఆర్ కి ఏదో ఒక రకంగా సమస్యలు చుట్టుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు కరోనాతో మొత్తం సీన్ మారిపోయింది. నిర్మాతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయట. ఆర్.ఆర్.ఆర్ మొదలైనప్పుడు బాహుబలి ని మించి వసూళ్ళు సాధిస్తుందన్న వాళ్ళు అదే నమ్మకం పెట్టుకున్న మేకర్స్ కి...కరోనా గట్టి దెబ్బ కొట్టింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: