కొన్ని సినిమాలు చరిత్ర సృష్టిస్తాయి. మరికొన్ని క్లాసిక్స్ గా ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఈ రెండు కేటగిరీలకూ చెందిన కొన్ని సినిమాలుంటాయి. ఈ రెండింటి కోవలోకి చెందే సినిమాల లిస్టులో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేసిన ‘పెదరాయుడు’ ఖచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా సృష్టించిన సంచలనం, రికార్డులు ఓ చరిత్రగా నిలిచిపోయాయి. మెహన్ బాబు సినీ కెరీర్లోనే కాదు.. ఆయన లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నుంచి వచ్చిన సినిమాల్లో ఓ కలికితురాయిగా నిలిచిపోయింది ‘పెదరాయుడు’. ఈ సినిమా వచ్చి నేటికి 25 ఏళ్లయినా ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా ఉండిపోయిన అద్భుతం ‘పెదరాయుడు’.

IHG

 

రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1995 జూన్ 15న విడుదలైంది. తొలి షో నుంచే బ్రహ్మాండమైన టాక్ తో తిరుగులేని విజయం సాధించింది. ఈ సినిమా విజయంలో మోహన్ బాబు విలక్షణ నటన, కథతో పాటు మరో ఆభరణం ‘రజినీకాంత్’. ఈ సినిమాలో ఆయన పోషించిన పాపారాయుడు పాత్ర సినిమాను శిఖరాగ్రాన కూర్చోబెట్టింది. రజినీ స్టైల్, మేకోవర్, యాక్టింగ్.. ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రజినీ విశ్వరూపం ప్రదర్శించారు. ఒరిజినల్ వెర్షన్ లోని టెంపోని ఎక్కడా మిస్ కాకుండా దర్శకుడు రవిరాజా తన టేకింగ్ తో మాయాజాలమే చేశాడు.

IHG

 

సినిమాలో సౌందర్య పశ్చాత్తాపం చెందే సీన్ మహిళా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగులో గ్రామ పెద్ద, తీర్పులు.. అంశాలతో సినిమాలు వచ్చినా పెదరాయుడు వాటన్నింటికీ అతీతంగా ఓ ట్రెండ్ సృష్టించింది. కోటి సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకూ కథ, కధనాలు ప్రేక్షకుల్ని కట్టిపడేసాయి. తమిళ్ ఒరిజినల్ ‘నాట్టామై’కు పెదరాయుడు రీమేక్. 53 సెంటర్లలో 100 రోజులతో పాటు సిల్వర్ జూబ్లీ కూడా రన్ అయింది. తెలుగు సనిమా చరిత్రలో ‘పెదరాయుడు’ ఓ చెరగని సంతకం.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: