సింపుల్ డైలాగ్ తో, తన సింపుల్ ఎక్స్ ప్రెషన్స్ తో సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు మహేష్ బాబు. ఆ సింపుల్ ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్స్ వెనుక చాలా కష్టం ఉంటుంది అది వేరే విషయం. టాలీవుడ్ లో కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ మొదట్లో ప్రిన్స్ ఇమేజ్ నుండి సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడం కోసం నిరంతరం కృషి చేస్తూ వచ్చారు. ఖలేజా టైంలో ఎలాంటి సినిమా చేయాలి అన్న సందిగ్ధంలో మూడేళ్లు ఒక్క సినిమా కూడా చేయక ఖాళీగా ఉన్నాడు మహేష్. ఇక హిట్లు, ఫ్లాపులు సమానంగా చేసుకుంటూ వచ్చిన మహేష్ తన మీద 100 కోట్ల బిజినెస్ జరుగుతుందని తెలుసుకుని సరైన కథల ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు. 

 

భరత్ అనే నేను సినిమా నుండి హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తున్న మహేష్ ప్రస్తుతం పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. సినిమా టైటిల్ బయటకు లీకైన లైన్ చూస్తే సినిమా పక్కా సూపర్ హిట్ అనేలా ఉంది. ఈ సినిమా తర్వాత దర్షధీరుడు రాజమౌళి డైరక్షన్ లో మహేష్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఇదిలాఉంటే టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్స్ గురించి ప్రస్థావిస్తే మహేష్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బోయపాటి సినిమా అంటే హీరో ఊర మాస్ గా కనిపిస్తాడు. మహేష్ లాంటి క్లాస్ హీరో అలాంటి వీరరసంలో చూడాలని సిని ప్రియుల కోరిక.

 

వినయ విధేయ రామ సక్సెస్ అయితే తప్పకుండా మహేష్ బోయపాటి సినిమా కన్ ఫర్మ్ అయ్యేది. కాని ఆ సినిమా అంచనాలను అందుకోకపోవడంతో బోయపాటి శ్రీను కథ చెబుతానని అపాయింట్మెంట్ అడుగుతున్నా మహేష్ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నాడని టాక్. మరి మహేష్ ఊర మాస్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ మరికొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: