గత ఏడాది బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ వచ్చి చేరాయి. ఎన్టీఆర్ కథా నాయకుడు, మహానాయకుడు ప్రేక్షకుఅలని అలరించకపోగా ఆ తర్వాత వచ్చిన రూలర్ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ పేలవ ప్రదర్శనని ఇచ్చింది. కే యస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాలయ్యకి చెడ్డ పేరు తీసుకొచ్చిందనే చెప్పాలి. పాతకాలం నాటి కథతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోక పోగా లుక్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.

 

 


దాంతో బాలయ్య అభిమానుల్లో అసహనం మొదలైంది. బాలయ్య చిత్రాల్లో కొత్తదనం ఉండట్లేదన్న మాట ఆ నోటా, ఈ నోటా చివరికి బాలయ్య వరకీ వెళ్ళినట్లుంది. అందుకే భవిష్యత్తులో తాను చేసే సినిమాల్లో కొత్తదనం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాడట. గత కొన్ని రోజులుగా బాలయ్య చేస్తున్న సినిమాలన్నీ కేవలం యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలే. కేవలం బాలయ్య అభిమానుల కోసమేనా అన్నట్లు ఉండే కొన్ని సినిమాలు అభిమానులకి కూడా నిరాశ కలిగించాయి.

 

 

అందుకే కొత్తదనం ఉండేలా సినిమాలు చిత్రీకరించాలని అభిమానుల నుండి రిక్వెస్టులు బాలయ్య దాకా వెళ్ళాయట. దాంతో బాలయ్య ఈ విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాడని సమాచారం. ప్రస్తుతం బాలయ్య- బోయపాటి చిత్రం ద్వారా కొత్తగా కనిపించనున్నాడట. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ద్వారా ఈ విషయం క్లియర్ గా అర్థం అయిందని చెప్పవచ్చు. లుక్ పరంగా బాలయ్య చాలా విభిన్నంగా కనిపిస్తున్నాడు. ఇంకా టైటిల్ కూడా పెట్టని ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

 

 

ఈ సినిమాలోనే కాదు తన తర్వాతి చిత్రాల్లోనూ కొత్తదనం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాడట. ఈ మేరకు తన వద్దకి కథలు తీసుకువచ్చే దర్శకులకి స్ట్రిక్టుగా ఆదేశాలు జారీ చేశాడని అంటున్నారు. మరి భవిష్యత్తులో ఎలాంటి సినిమాల్లో కనిపిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: