టాలీవుడ్ ఇండస్ట్రీ దర్శకులలో గోపీ చంద్ మలినేని వ్యక్తిత్వం విభిన్నం. అతడు ఇప్పటివరకు తీసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ ఇండస్ట్రీలో అతడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రవితేజా ను ‘డాన్ శీను’ గా చూపెట్టి మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకుని ‘బలుపు’ మూవీతో మంచి ప్రశంసలు అందుకున్న ఈదర్శకుడు మధ్యలో కొన్ని పరాజయాలు చూసాడు. 


ప్రస్తుతం రవితేజా తో ‘క్రాక్’ మూవీని తీస్తున్న ఇతడు మాస్ మహారాజా తో హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. వాస్తవానికి ఈసినిమా లాక్ డౌన్ సమస్యలు రాకుండా ఉండి ఉంటే ఈ పాటికి విడుదల అయి ఉండేది. తెలుగు రాష్ట్రాలలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా నిర్మిస్తున్న ఈ మూవీ చాల పవర్ ఫుల్ గా ఉంటుంది అని అంటున్నారు. 


ప్రస్తుతం ధియేటర్లు లేకపోవడంతో సినిమాలు ఒటిటి విడుదల అవుతున్న సందర్భం గురించి మాట్లాడుతూ ఇళ్ళల్లోని టీవీలలో సినిమాలు చూసే జనం ఆ సినిమా ఎంత బాగున్నా పెద్దగా శ్రద్ధపెట్టి చూడరు అని అందువల్ల కష్టపడి తీసిన సినిమాలు ఇలా ఒటీటీ ద్వారా విడుదల అయినా ప్రయోజనం ఉండదు అని ఈ దర్శకుడు అభిప్రాయపడుతున్నాడు. అందువల్ల ‘క్రాక్’ విడుదల చేయడానికి ధియేటర్లు ఓపెన్ చేసే వరకు తమ మూవీ ఎదురు చూస్తుందని అంటూ ప్రేక్షకులకు ధియేటర్లలో సినిమాలు చూసినప్పుడు వచ్చే కిక్ ఒటీటీ సినిమాలలో ఉండదు అని గోపీ చంద్ అభిప్రాయ పడుతున్నాడు.


పవన్ కళ్యాణ్ బాలకృష్ణలకు వీరాభిమాని అయిన గోపీ చంద్ వారిద్దరిలో ఎవరో ఒకరితో ఒక సినిమా చేయడం తన ధ్యేయం అని అంటున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ సమయం వల్ల తనకు ఏర్పడ్డ ఖాళీలో తాను ఒక పవర్ ఫుల్ కథను వ్రాసానని తాను ఆ కథను ఒక పెద్ద హీరోని దృష్టిలో పెట్టుకుని వ్రాసాను అని చెపుతూ మరో రెండు వారాలలో ఆ హీరోను తాను కలవబోతున్న విషయాన్ని గోపీ చంద్ లీక్ చేసాడు. దీనితో ఈ కథలో పవన్ నటిస్తాడా లేదా బాలకృష్ణ నటిస్తాడా అన్న సస్పెన్స్ ప్రస్తుతానికి కొనసాగుతోంది..     

మరింత సమాచారం తెలుసుకోండి: