ఎనభైల నుంచీ ఇప్పటి వరకూ మెగాస్టార్ చిరంజీవి సినిమాపై అంచనాలు ఒకేలా ఉన్నాయి. అయితే.. భారీ అంచనాలతో విడుదలయ్యే సినిమాల విషయంలో ఏమాత్రం అదుపు తప్పినా ప్రమాదమే. ఇటువంటి ఫెయిల్యూర్ నే చిరంజీవి తొంభైల్లో చూశారు. చిరంజీవి కెరీర్లో ఒక డిజాస్టర్ గా మిగిలిపోయిన ఆ సినిమా ‘బిగ్ బాస్’. ‘ఇకై తానెలాంటి సినిమాలు చేయాలి’ అని చిరంజీవినే పునరాలోచనలో పడేసిన సినిమా ఇది. ఈ సినిమా విడుదలై నేటికి 25 ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

ఫ్యాన్స్ సమక్షంలో అట్టహాసంగా ప్రారంభమైన ఈ సినిమా 1995 జూన్ 15న విడుదలైంది. అంచనాలకు తగ్గ కథ లేకపోవడం మెయిన్ మైనస్. 1991లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘గ్యాంగ్ లీడర్’ అంచనాలు ఈ సినిమాపై ఉండడం ఓ కారణం. కథ, కథనం, టేకింగ్, పాటలు.. ఇలా ప్రతి విభాగంలో మునుపటి టెంపో మెయింటైన్ చేయడంలో చిరంజీవి-విజయబాపినీడు ఫెయిల్ అయ్యారు. దీంతో సినిమా డిజాస్టర్ గా మిగిలింది. తన సంగీతంతో ‘స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు’కు బప్పిలహరి చేసిన మ్యాజిక్ ఈ సినిమాకు మిస్ అయింది. చిరంజీవి స్థాయి ఓపెనింగ్స్ వచ్చినా లాంగ్ రన్ లో తేలిపోయింది.

IHG

అప్పటికి దశాబ్దానికి పైగా చిరంజీవి-విజయబాపినీడు-శ్యాంప్రసాద్ ఆర్ట్స్ కాంబోలో వరుస హిట్లు వచ్చాయి. ‘పట్నం వచ్చిన పతివ్రతలు, మగమహారాజు, మహానగరంలో మాయగాడు, మగధీరుడు, ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ల్ లీడర్’ అన్నీ హిట్లే. కానీ.. బిగ్ బాస్ మాత్రం మిస్ ఫైర్ అయింది. ఇదే రోజు విడుదలైన మోహన్ బాబు ‘పెదరాయుడు’ ప్రభంజనం ముందు నిలవలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఈ ముగ్గురి కాంబినేషన్ తెరమరుగై మరో సినిమా రాలేదు. ఒక డిజాస్టర్ తో ఇంతటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కు ఫుల్ స్టాప్ పడడం బాధాకరమైన విషయం.

IHG

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: