ఒకానొక టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మినిమమ్ గ్యారెంటీ లాభాలు తెచ్చి పెట్టే హీరోగా మాస్ మహారాజా రవితేజ కి మంచి మార్కెట్ ఉండేది. అయితే వరుస పెట్టి ఫ్లాపులు రావటంతో...రవితేజ కొంత గ్యాప్ అప్పట్లో ఇవ్వటం జరిగింది. గ్యాప్ ఇచ్చిన తర్వాత 'రాజా ది గ్రేట్' అనే సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎక్స్పెరిమెంటల్ గా చేసి అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో రవితేజ కి మళ్లీ మంచి టైం వచ్చింది అని అందరూ భావించారు. అయితే ఆ తరువాత నటించిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడటంతో ఇప్పుడు రవితేజ కెరియర్ డేంజర్ జోన్ లో పడింది.

IHG

ప్రస్తుతం తనకి గతంలో 'బలుపు' మరియు 'డాన్ శీను' లాంటి రెండు బ్లాక్ బస్టర్ విజయాలు అందించిన అభిమాని డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' సినిమాని చేయడం జరిగింది. సినిమా మొత్తం కంప్లీట్ అయింది త్వరలోనే సినిమా రిలీజ్ అవటానికి రెడీగా ఉంది. రవితేజ భవిష్యత్తు మొత్తం ఈ సినిమా పై ఆధారపడి ఉంది. ఈసారైనా హిట్ కొడతాడా…?, గోపీచంద్ మలినేని రవితేజని ఆదుకుంటాడని రవితేజ అభిమానులు ఆశిస్తున్నారు.

IHG

ఇదిలా ఉండగా మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయినా ‘అయ్యప్పన్ కోషియమ్’ తెలుగులో రవితేజ నటించబోతున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో రీమేక్ చేయబోతోండగా అన్ని పరిస్థితులు చక్కబడి అనుకూలిస్తే ఈ సినిమా ఆగస్టు నుండి సెట్స్ మీదకి వచ్చే అవకాశం ఉందట. సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాలలో ఏదో ఒకదానితో హిట్ కొట్టాలి అని ఫాన్స్ ఆశిస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: