టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. తాత వారసత్వాన్ని కొన‌సాగిస్తూ తెలుగు సినిమాల్లో తిరుగులేని ఈ తరం హీరోగా ఎదిగిన ఈయ‌న గురంచి ఎంత చెప్పుకున్నా త‌క్కువే.  మోస్ట్ ఎనర్జటిక్ హీరోగా రసజ్ఞులైన అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్‌. అయితే ఎన్టీఆర్ కెరీర్ ఎన్నో సినిమాలు.. మ‌రెన్నో పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. 

IHG

అలాంటి వాటిలో య‌మ‌దొంగ చిత్రంలో మ‌ద‌ధ‌ర్మ‌రాజుగా ఎన్టీఆర్ న‌ట‌న అద్భుతం అని చెప్పాలి. ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వచించిన య‌మ‌దొంగ‌ సినిమా అప్పట్లో రికార్డులు సృష్టించింది. సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫిస్ వ‌ద్ద రికార్డులు సృష్టించి 30.1కోట్ల షేర్‌ను ద‌క్కించుకుంది.  గ్రాఫిక్స్‌ పరంగా దర్శకుడు రాజమౌళి ప్రతిభను వెలికితీసిన తొలి చిత్రమిది. 

IHG

ప్రియమణి, మమతా మోహన్ దాస్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రంలో  కలెక్షన్ కింగ్ మోహన్ బాబు యముడుగా నటిస్తే.. ఆ యముడిని భయపెట్టే యంగ యమగా ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. యమధర్మరాజుగా డైలాగ్​ కింగ్ మోహన్​బాబు అద్భుతంగా నటించాడు. అయితే అంత‌కుమించి ఎన్టీఆర్ విశ్వ‌రూపం చూపించాడ‌ని చెప్పాలి. యంగ య‌మ‌గా ఎన్టీఆర్ గుక్క తిప్పుకోకుండా చెప్పిన డైలాగ్స్‌ మ‌రియు న‌ట‌న‌ థియేటర్లలో ప్రేక్షకుల చేత‌ కేక‌లు పెట్టించింది. 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=YAMADONGA' target='_blank' title='yamadonga-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>yamadonga</a> to be released in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TAMIL' target='_blank' title='tamil-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>tamil</a> ...

యమలోకం నేపథ్యంలో మోహన్‌ బాబు, ఎన్టీఆర్‌ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. ఇక  ఈ చిత్రంలో ప్రేక్షకులు మెచ్చిన మరో ప్రధాన అంశం సంగీతం. కీరవాణి అందించిన పాటలు, నేపథ్య సంగీతం శ్రోతలను విపరీతంగా అలరించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: