టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలకు హీరోయిన్ కష్టాలు ఎదురవుతున్నాయి.చాలా వరకు హీరోలు ఫ్రెష్ కాంబినేషన్స్ కోరుకోవడం తో సినిమా హీరోయిన్స్ ని రిపీట్ చేయడానికి ఇష్టపడటం లేదు. దీంతో డైరెక్టర్లకు హీరోయిన్ సమస్యలు పెద్ద తలనొప్పిగా మారిపోయాయి. పూజా హెగ్డే మరియు రష్మిక మందన సూపర్ డూపర్ హిట్ సినిమాలు కొడుతున్న వాళ్లను రిపీట్ చేయడం లేదు స్టార్ హీరోలు.

IHG

ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగొందిన అనుష్కతో అయితే ప్రజెంట్ ఏజ్ ప్రాబ్లమ్స్ అడ్డుతగలడంతో ఆమెకి కూడా పెద్దగా అవకాశం దొరకడం లేదు. దీంతో టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్ ప్లేస్ ఖాళీ అయి చాలా కాలమైంది. ఇప్పటివరకు ఈ ప్లేస్ ఎవరు రీప్లేస్ చేయలేకపోయారు. ఈ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే ప్రశ్న కంటిన్యూ అవుతూనే ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలైన పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు ఇంకా కొంత మంది హీరోలకు హీరోయిన్ల ను సెట్ చేయడానికి డైరెక్టర్లు తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు.

IHG's & <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HEROINE' target='_blank' title='heroines-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>heroines</a> Remuneration Details 2020

పెళ్ళితో కమర్షియల్ మూవీస్ దూరమైపోయిన సమంత, 30 లోకి వెళ్లి పోయిన కాజల్, తమన్నా బెస్ట్ ఆప్షన్ గా ప్రజెంట్ ఉన్న యంగ్ బ్యూటీస్ సరైన రీతిలో ప్రూవ్ చేసుకోలేక పోవడం తో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కష్టాలు మొదలయ్యాయి. సినిమా స్క్రిప్ట్, హీరో అంతా ఓకే అయినా గాని హీరోయిన్ విషయానికి వచ్చేసరికి ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు చాలా టైం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో పరిస్థితి ఈ విధంగానే ఉంటే సినిమాలు నిర్మించడానికి చాలా టైం పడుతుంది అని సినిమా విశ్లేషకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: