స్టార్ సినిమా అంటే చాలు అభిమానుల్లోనే కాదు సగతు సిని ప్రేక్షకుడికి కూడా ఆ సినిమాపై అంచనాలు ఉంటాయి. అయితే కొందరు స్టార్స్ ఫ్యాన్స్ ను మరీ ఇబ్బంది పెట్టకుండా తమ సినిమాల అప్డేట్స్ ఇచ్చేస్తుంటారు కాని కొందరు మాత్రం ఆ హీరో సినిమా టైటిల్స్ దగ్గర నుండి సినిమా రిలీజ్ డేట్ వరకు అంతా సీక్రెట్ గా ఉంచాల్సిందే. అలా చేయాలని ఆ హీరో చెబుతాడో లేక ఆ సినిమా దర్శక నిర్మాతలు అలా ప్లాన్ చేస్తారో తెలియదు కాని స్టార్ హీరోల సినిమాల అప్డేట్ గురించి ఫ్యాన్స్ అదేదో ఎక్సాం రిజల్ట్ గురించి ఎదురుచూసినట్టుగా చూస్తారన్నమాట.

 

ఈ కోవలో ముందుగా చెప్పాలంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వస్తాడు. బాహుబలి తర్వాత సాహో అని త్వరగానే ఎనౌన్స్ చేసినా ఆ సినిమా రిలీజ్ డేట్.. సినిమా అప్డేట్ కు సంబందించిన విషయాల పట్ల చాలా సస్పెన్స్ మెయింటైన్ చేశారు. ఇక ఇప్పుడు అదే తరహాలో ప్రస్తుతం చేస్తున్న రాధాకృష్ణ డైరక్షనల్ మూవీ కూడా అసలు ఎలాంటి లీకులు, అప్డేట్స్ ఇవ్వకుండా జాగ్రత్తపడుతున్నారు. స్టార్ సినిమా కాబట్టి రిలీజ్ ఎప్పుడైనా సరే సరిగ్గా వారం ముందు ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే రావాల్సిన బజ్ వచ్చేస్తుంది. కాని అప్పటివరకు సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేని ఆ హీరో ఫ్యాన్స్ మాత్రం నిరుత్సాహంగా ఉంటారు.

 

మాములుగా బర్త్ డేకి ఓ ఫస్ట్ లుక్, ఫెస్టివల్ కు ఓ టీజర్, ట్రైలర్ ఇలాంటి అప్డేట్స్ ఇస్తే ఫ్యాన్స్ తో పాటుగా సిని ప్రియులు సంతోషిస్తారు. కాని ప్రభాస్ సినిమా అప్డేట్ గురించి మాత్రం వాళ్లు రివీల్ చేయాలని అనుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. మొన్నటిదాకా మహేష్ కూడా ఇలాంటి సస్పెన్స్ మెయింటైన్ చేయగా ఈమధ్య రూట్ లోకి వచ్చాడు. జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా గురించి రకరకాల టైటిల్స్, గాసిప్స్ వస్తున్నాయి. వాటిల్లో ఏది నిజం అన్నది చిత్రయూనిట్ చెబితేనే తెలుస్తుంది. ఇంతకీ ప్రభాస్ సినిమా ఇంత సీక్రెట్ ఎందుకు అన్నది మాత్రం అర్ధం కావట్లేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: