అక్కినేని ఫ్యామిలీ యువ హీరో అక్కినేని అఖిల్ కెరియర్ లో మూడు సినిమాలు చేసినా ఇప్పటివరకు ఒకటి కూడా కమర్షియల్ హిట్టు దక్కలేదు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ ను.. మూడు సినిమాలు మూడు జానర్ లలో చేసిన అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న క్రేజీ బ్యూటీ పూజా హెగ్దె ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

 

ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. ఇప్పటివరకు 80 శాతమ్మ్ వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రష్ చూసి చిత్రయూనిట్ రిజల్ట్ మీద చాలా కాన్ ఫిడెంట్ గా ఉందని తెలుస్తుంది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత సూపర్ హిట్ స్టోరీతోనే అఖిల్ సినిమా చేస్తున్నాడు భాస్కర్. అంతేకాదు యూత్ ఆడియెన్స్ మెచ్చే అంశాలు ఈ సినిమాలో చాలా ఉన్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. బ్యాచిలర్ కోడ్స్ ను ఈ సినిమాలో స్పెషల్ గా క్రియేట్ చేశారట.

 

అంతేకాదు పూజా హెగ్దె అందాలు కూడా ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నాయని తెలుస్తుంది. తెలుగులో సూపర్ ఫాం లో ఉన్న పూజా హెగ్దె అఖిల్ సరసన కూడా నటించి యువ హీరోలకు లక్కీ చార్మ్ గా మారాలని చూస్తుంది. మరి బుట్టబొమ్మ లక్ ఫ్యాక్టర్ తోడై అఖిల్ బ్యాచిలర్ సినిమా హిట్టు కొడుతుందేమో చూడాలి. ఈ సినిమాతో ఎలాగైనా మొదటి హిట్టు కొట్టాలని చూస్తున్న అఖిల్ సినిమా అటుఇటైతే మాత్రం కొద్దిగా నిరాశచెందక తప్పదు.             

 

మరింత సమాచారం తెలుసుకోండి: