కొన్ని సినిమాలు అంచనాల మధ్య విడుదలై వాటిని అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతూ ఉంటాయి. మరికొన్ని కాంబినేషన్లతో హైప్ క్రియేట్ అయి అంచనాలు అందుకోలేవు. ఈ కేటగిరీలోకి వచ్చే సినిమా ‘డియర్ కామ్రేడ్’. విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. అంతకుముందు వీరిద్దరూ కలసి నటించిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో విడుదలయ్యేంత హైప్ క్రియేట్ అయిందీ సినిమాపై. బాక్సాఫీస్ వద్ద చతికిలపడినా ఇప్పుడు డియర్ కామ్రేడ్ మరో రకంగా రికార్డులు సృష్టిస్తోంది.

IHG

 

ఈమధ్య మన తెలుగు సినిమాలు హిందీలో డబ్ అవుతున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్ లో మన తెలుగు సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. ఇప్పుడు డియర్ కామ్రేడ్ కూడా హిందీలోకి డబ్ అయి రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఏకంగా 1.6 మిలియన్ల లైక్స్ తో తెలుగు డబ్బింగ్ మూవీస్ లో నెంబర్ వన్ గా ఉంది. వ్యూస్ లో 130 మిలియన్లలో ఉంది. వ్యూస్ పరంగా జయ జానకీ నాయక సినిమా 240 మిలియన్ వ్యూస్ లో ముందు ఉంది. కానీ.. లైక్స్ పరంగా 1.3 మిలియన్లోనే ఉంది. దీంతో యూట్యూబ్ అత్యధిక ఆదరణ పొందిన తెలుగు సినిమాగా డియర్ కామ్రేడ్ నిలిచింది.

IHG

 

త్వరలో మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేంతగా దూసుకెళ్తోంది. తర్వాతి స్థానాల్లో హలో గురూ ప్రేమకోసమే, ఇస్మార్ట్ శంకర్, సరైనోడు నిలుస్తున్నాయి. బన్నీ సినిమాతోనే తెలుగు సినిమాల ఆదరణ తెలిసింది.  చెప్పాలంటే మెగాస్టార్ ఇంద్ర డబ్బింగ్ మూవీ యూట్యూబ్ లో అప్పటికి మంచి వ్యూస్ తెచ్చుకుంది. క్రమంగా తెలుగు సినిమాలకు పెరిగిన ఆదరణతో యూట్యూబ్ లో మంచి వ్యూస్ వస్తున్నాయి. సినిమా పరంగా తెలుగు ప్రేక్షకులు గర్వించే విషయం అని చెప్పాలి.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: