తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరో వెంకటేష్ ప్రస్తుతం జూనియర్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే దాదాపు మూడు దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు వెంకటేష్. స్టార్ నిర్మాత నటుడు అయిన దగ్గుబాటి రామానాయుడు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన వెంకటేష్... ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు, వెంకటేష్ కెరీర్లో ఎన్నో మైలురాళ్ల లాంటి సినిమాలు ఉన్నాయి అని చెప్పాలి. 

 


 అయితే వెంకటేష్ మొదటినుంచీ ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. వెంకటేష్ ఎంచుకునే సినిమాలు కూడా బాగా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతూ ఉండేవి. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ పండించడంలో వెంకటేష్ కి  ఎవరు సాటి రారు అని చెప్పాలి. ఎలాంటి ఫ్యామిలీ ఎమోషన్ లో  అయినా పరకాయ ప్రవేశం చేసి మరీ నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తే ఉంటారు విక్టరీ వెంకటేష్.అందుకే మొదటి నుండి  ఫ్యామిలీ ఆడియన్స్ లో విక్టరీ వెంకటేష్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ను సంపాదించుకున్నారు. 

 


 అయితే మొదటి నుంచి ఫ్యామిలీ ఎమోషన్స్ భారాన్ని మోస్తూ వచ్చిన వెంకటేష్ ప్రస్తుతం అలాంటి పాత్రలకు పరిమితం కావలసి వచ్చింది. అటూ ప్రేక్షకులు  కూడా వెంకటేష్ నుంచి అలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ పండించే పాత్రలు అయితేనే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హీరో అన్నాక ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉండాలి కాబట్టి వెంకటేష్ కూడా ఎక్కువగా అలాంటి సినిమానే చేసుకుంటూ పోతున్నారు, ఒకప్పుడు యాక్షన్ సినిమాలు చేసినప్పటికీ ప్రస్తుతం మాత్రం అలాంటి సినిమాల జోలికి పోవడం లేదు వెంకటేష్.ఇక ఈ మధ్య కాలంలో యువ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్నారు  విక్టరీ వెంకటేష్. అంతేకాకుండా బ్లాక్బస్టర్ విజయాలను అనుకుంటున్నారు. విక్టరీ వెంకటేష్ సోలోగా సినిమా చేసి చాలా రోజులు అయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: