తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి నట  వారసుడైన బాలకృష్ణ ప్రస్తుతం ప్రస్థానం  అద్భుతంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే బాలకృష్ణ కెరీర్ లో ఆయన పోషించని పాత్రలు లేవు అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో పౌరాణిక పాత్రల్లో నటించడంతో పాటు... కామెడీ ఎమోషన్స్ పండించి ఎన్నో చిత్రాల్లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు నందమూరి బాలకృష్ణ. తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ సినీ కెరియర్  ఎప్పుడు అద్వితీయంగా సాగిపోయింది అని చెప్పాలి. 

 


 ముఖ్యంగా ఎన్నో పౌరాణిక పాత్రల్లో నటించి ప్రస్తుతం ఉన్న ఏ హీరోకి సాధ్యం కానీ సరికొత్త చరిత్ర సృష్టించారు నందమూరి బాలకృష్ణ, ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలలో జూనియర్ హీరోలలో ఎవరు కూడా ఇప్పటివరకు పౌరాణిక పాత్రల్లో నటించింది లేదు. అంతే కాకుండా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు నందమూరి బాలకృష్ణ. ఇక ప్రస్తుతం యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాలు  చేసుకుంటూ దూసుకుపోతున్నారు  అప్పట్లో అందగాడిగా కూడా బాలకృష్ణ ఎంతో మంది యువతుల మనసును దోచాడు. 

 

 అయితే ఇప్పుడు వరకు నందమూరి బాలకృష్ణ  ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి మరి నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ  ఉంటాడు నందమూరి బాలకృష్ణ, కానీ నందమూరి బాలకృష్ణకు ఇప్పటివరకు సెట్ అవ్వని  పాత్ర ఏదైనా ఉంది అంటే అది లవర్ బాయ్ పాత్ర . బాలకృష్ణ తన కెరియర్లో లవర్ బాయ్ గా  ఎప్పుడూ నటించలేదు  అనే చెప్పాలి. అటు ప్రేక్షకులు కూడా బాలకృష్ణ ను  లవర్ బాయ్ గా  అసలు ఊహించుకో లేరు.కానీ యాక్షన్ సన్నివేశాల్లో మాత్రం ప్రేక్షకులను అలరించడంలో బాలయ్యకు ఎవరు సాటిరారు అనే చెప్పాలి. ఇప్పటివరకు ఎన్నో యాక్షన్ సన్నివేశాల్లో నటించి ప్రేక్షకులను అద్భుతంగా ఉర్రూతలూగిస్తున్న డు నందమూరి బాలకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: