సినీ వినీలాకాశంలో ఎంతో ఎదగాల్సిన తారలు మానసికాందోళన, ఆర్థక ఇబ్బందుల వల్ల మద్యలోనే తనువు చాలిస్తున్నారు.   పలు విజయవంతమైన చిత్రాలలో నటించి, మెప్పించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్, అర్థాంతరంగా తనువు చాలించాడు. చిన్న చిన్న సమస్యలతో తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయి, బలవన్మరణం చెందారు.  సినిమాల్లో అవకాశాలు రావడం లేదనో, హిట్స్ వచ్చినప్పుడు ఉన్న ఆనందంలో మునిగిపోయి.. ఫ్లాప్స్ వస్తే దుఖఃంలో మగ్గిపోయి.. ఆర్థిక సమస్యలు, జీవిత భాగస్వామితో సమస్యలు, సమయానికి ఓదార్పు లభించక ఇలా ఎన్నో కారణాలతో సినీ తారల జీవితాలు మధ్యలోనే కొడిగడుతున్నాయి. వెండి తెరపైనే కాదు బుల్లితెరపై కూడా ఎంతో మంది నటులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

IHG

తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఉదంతం సినీ ప్రముఖులను కలచివేసింది. దీనిపై ప్రముఖ నటి ఖుష్బూ స్పందించారు.  తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశానని.. కెరీర్ ప్రారంభంలో ఎంతో మంది తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని.. అన్నారు. తన జీవితంలోనూ ఆత్మహత్య చేసుకోవాలని భావించిన క్షణాలు ఉన్నాయని వెల్లడించారు.  ఓ దశలో జీవితంపై ఎలాంటి ఆశ లేని పరిస్థితి ఏర్పడిందని, ఓ సొరంగం చివరన అంధకారంలో నిల్చున్న భావన కలిగిందని వివరించారు.

IHG

ఆ సమయంలో తన స్నేహితులు... కొంత మంది సహనటులు వెలుగు రేఖల్లా మారారని, ఒక్క అవకాశం తన జీవితాన్ని మార్చివేస్తుందన్న ఆశను పెంపొందించుకున్నానని, ఆ దృక్పథం ఫలితమే ఇప్పుడిలా ఉన్నానని తెలిపారు.  సినీ పరిశ్రమలో చాలా మందికి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి.. అంత మాత్రాన చావు ఒక్కటే పరిష్కారం కాదు.. ఇక తప్పదు అదే అనుకున్న సమయంలో మన స్నేహితులు.. సహనటులు వారితో మన కష్టాలు షేర్ చేసుకుంటే ఏదైనా సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు ఖుష్బూ.  

మరింత సమాచారం తెలుసుకోండి: