సినిమాల్లో స్టార్ క్యాస్ట్ ఉంటే భారీ సినిమా అవుతుంది. అదే.. రెండు భాషలకు చెందిన ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి సినిమా చేస్తే ఓ భారీ మల్టీస్టారర్ అవుతుంది. కానీ.. వాళ్లను కలిపేదెవరు.. కథతో మెప్పించేదెవరు అనే ప్రశ్న రావడం సహజం. కానీ.. కొద్దిలో మిస్సయిన ఆ భారీ ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేసింది క్రేజీ డైరక్టర్ మణిరత్నం. ఒప్పించింది.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్, తమిళ దళపతి విజయ్ లను. వీరిద్దరూ హీరోలుగా ‘పొన్నియన్ సెల్వన్’ ప్రాజెక్టుకు 2016లోనే అంతా సిద్ధం చేశాడు. కానీ అప్పట్లో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. దీనికి కారణాలు కూడా బయటకు రాలేదు.

IHG's 'Ponniyin Selvan' released - The Hindu

 

దీనిపై మణిరత్నం భార్య సుహాసినీ ఇటీవల ఓ మీడియా ఇంటరాక్షన్ లో స్పందించింది. అప్పట్లో ఈ సినిమా ఆగిపోవడానికి.. ఇప్పుడు మొదలవడానికి కారణాలు వివరించింది. ‘నిజానికి పొన్నియన్ సెల్వన్ 2016లోనే తెరకెక్కాల్సింది. సినిమాలో నటించేందుకు మహేశ్, విజయ్ కూడా అంగీకరించారు. కానీ.. ఈ సినిమాకు భారీ వీఎఫ్ఎక్స్ కావాలి. ఈ సినిమాకు అవసరమైన టెక్నాలజీ అప్పట్లో లేకపోయింది. కేవలం ఆ కారణంగా మణిరత్నం అప్పట్లో ఈ ప్రాజెక్టును విరమించుకున్నారు. ఇప్పుడు వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాయి. అందుకే తెరకెక్కిస్తున్నారు’ అని చెప్పుకొచ్చింది.

IHG's 'Ponniyin Selvan' will be shot in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TAMIL' target='_blank' title='tamil-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>tamil</a> Nadu and ...

 

సుహాసిని మాటల ప్రకారం మహేశ్, విజయ్ లతో సినిమా చేసుంటే భారీ ప్రాజెక్ట్ అయ్యేదే. ప్రస్తుతం ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, మోహన్ బాబు, జయరాం, పార్తీబన్, ఐశ్వర్య.. వంటి భారీ క్యాస్ట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చోళుల కథాంశంతో తెరకెక్కుతోందీ సినిమా. ఇప్పటికే ఓ షెడ్యూల్ ను థాయిలాండ్ అడవుల్లో తెరకెక్కించారు. మణిరత్నం, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ కాన్వాస్ లో తెరకెక్కిస్తున్నారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: