అద్భుతమైన నటుడు.. మన తెలుగు ప్రేక్షకులు అతనిది ఒక్క సినిమా మాత్రమే చూశారు. కానీ అభిమానులయ్యారు. ఏందుకంటే అతను తీసింది ఓ బయో పిక్. అదే మన సూపర్ క్రికెటర్ ఎంఎస్ ధోని చిత్రం. ఆ సినిమా నిజంగా ఎంత అద్భుతం అంటే మాటల్లో చెప్పలేం. మనకు ధోని అంటే రియల్ ధోని కాదు రీల్ ధోనినే గుర్తొస్తాడు. అంతగొప్పగా నటించాడు. 

 

IHG

 

సరే నటన అంత వదిలెయ్యండి.. మన తెలుగులో ఒక సినిమానే.. బాలీవుడ్ లో బోలెడు సినిమాలు. అతని సినిమా ఒక్కటి చుసిన మనకే కళ్ళలో నీళ్లొస్తుంటే అయన ఎన్నో సినిమాలు చుసిన బాలీవుడ్ ప్రేక్షకుల పరిస్థితి ఎలా ఉంటుంది. మంచి నటుడు, మంచి విద్యార్థి, మంచి జీవితం, అద్భుతమైన ఆరోగ్యం.. వెలకట్టలేని ఆస్థి. చంద్రుడిపైనే స్థలం కొన్న నటుడు సుశాంత్. 

 

IHG

 

ఎన్ని ఉంటే ఏంటి? మనశాంతి లేదు. అతని బాధను చెప్పుకోవడానికి తోడుగా ఒక మనిషి లేరు. ప్రాణంగా ప్రేమించే తల్లి ఇటీవలే అనారోగ్యంతో మరణించింది. మానసికంగా ఆరు నెలల క్రితమే మరణించాడు, భౌతికంగానే నిన్న చనిపోయాడు. ఏమైతేనేమి మంచి మనిషి చనిపోయాడు. సినీ లోకానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. 

 

IHG

 

ఎందరికో సాయం చేశాడు.. కోట్లమంది అభిమానులు ఉన్నారు.. కానీ అతని బాధ వినే మనిషిలేకపోయే. ఎవరు అతని బాధ గుర్తించలేకపోయారు.. ఏం మాట్లాడిన ఏం లాభం లేదు ప్రస్తుతం. కోట్లమందిని చిన్న చిరునవ్వుతో నవ్వించిన ఈ హీరో అతని మరణంతో అందరిని బాధపెట్టాడు. ఇలాంటి అర్ధాంతర మరణాలు ఎవరికి రాకూడదు అని దేవుడిని ప్రార్ధిద్దాం. 

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: