రైజింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ పెంగ్విన్. లేడీ ఓరియేంటేడ్ మూవీగా తెరకెక్కిన ఈచిత్రం మరో నాలుగు రోజుల్లో అమెజాన్ ప్రైమ్ లోకి  రానుంది. నిజానికి ఏప్రిల్ లో ఈచిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు కానీ కరోనా వల్ల విడుదలవాయిదాపడింది ఇక ఇప్పట్లో థియేటర్లు తెరుచుకొనే పరిస్థితి లేకపోవడంతో డైరెక్ట్ గా డిజిటల్ విడుదలకు ఓకే చెప్పారు నిర్మాతలు. దాంతో ఈనెల 19న ప్రైమ్ లో తమిళ ,తెలుగుతోపాటు మలయాళం లో కూడా విడుదలకానుంది.
 
ప్రమోషన్స్ లో భాగంగా కొద్దీ రోజుల క్రితం ట్రైలర్ ను విడుదలచేయగా సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకొని సినిమా పై అంచనాలను  పెంచేసింది. ఇక ఈట్రైలర్ అన్ని భాషల్లో టీవి , డిజిటల్ కలిపి 30మిలియన్ల వ్యూస్ ను రాబట్టిందని అధికారిక ప్రకటన వెలుబడింది. రేపు ఈ సినిమాలోని మొదటి సాంగ్ కూడా విడుదలకానుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సాంగ్ ను విడుదల చేయనున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన ఈచిత్రాన్ని పేట డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.
 
ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ మరో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తుంది. అందులో మిస్ ఇండియా ఒకటి. నరేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈచిత్రాన్నిమహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్నాడు.  ఈసినిమా తోపాటు కీర్తి, నగేష్ కుకునూర్ డైరెక్షన్ లో గుడ్ లక్ సఖి అనే చిత్రంలో నటిస్తుంది. స్పోర్ట్స్  బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  ఆది పినిశెట్టి , జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈరెండు సినిమాలను కూడా డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలచేయనున్నారని ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: