తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను తెరకెక్కించే దర్శకులు చాలా తక్కువ మందే ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను తెరకెక్కించే దర్శకులలో  ముఖ్యంగా శేఖర్ కమ్ముల కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది.. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల సరికొత్త పంథాను అనుసరిస్తూ ఉంటాడు. అందుకే శేఖర్ కమ్ముల సినిమాలన్నీ మిగతా దర్శకులతో పోలిస్తే ఎంతో విభిన్నంగా ఉంటాయి. నిజ జీవిత పాత్రలకు దగ్గరగా ఉంటాయి శేఖర్ కమ్ముల  సినిమాలోని అన్ని పాత్రలు. 

 


 అయితే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతలా  ఫిదా చేసింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో సాయి పల్లవి తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది. అయితే తెలుగు రానప్పటికీ కూడా తెలుగు నేర్చుకుని తెలంగాణ యాసలో సాయి పల్లవి డైలాగ్ లు చెప్పడంతో తెలుగు ప్రేక్షకులందరూ నిజంగానే ఫిదా అయిపోయారు అని చెప్పాలి. ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ ఎంతగానో ఆకర్షించింది అలరించింది. 

 


 ఇక ఈ సినిమా ఎన్నిసార్లు వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి తెగ ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన మొదటి సారి చూసిన కిక్ వస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో  వరుణ్ తేజ్ సాయి పల్లవి ల నటన అయితే తెలుగు ప్రేక్షకులందరిని  ఫిదా చేసింది అనే చెప్పాలి. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ని గుర్తు చేస్తూ... నేటితరం యువత ఎలా ఉన్నారు ఎలా ఉండకూడదు అనేది కూడా చెబుతూ... ఒక మంచి మెసేజ్ ఇచ్చారు దర్శకుడు శేఖర్ కమ్ముల.ఫిదా  సినిమా టాలీవుడ్లో ఆల్ టైం ఫేవరేట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: