సినిమాల్లో ఎన్ని రకాల జోనర్లు ఉన్నా కుటుంబ కథలకు ఉండే ప్రామఖ్యం వేరు. ఇంటిల్లపాదీ కలిసి సినిమా చూడాలంటే కుటుంబ కథలే దిక్కు. అటువంటి సినిమాలకు తెలుగు సినీ పరిశ్రమలో కొదవ లేదు. ఈ జనరేషన్ లో కూడా స్టార్ హీరోలు అడపాదడపా కుటుంబ కథలకు మొగ్గు చూపుతూనే ఉంటారు. టాలీవుడ్ పవర్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ ఉన్న పవన్ కల్యాణ్ కూడా ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఓ కుటుంబ కథ చేశారు. కంటెంట్ ఉన్న కథకు స్టార్ డమ్ తోడైతే సంచలనాలు నమోదు చేయొచ్చని ఈ సినిమా నిరూపించింది.

IHG's Aunt ...

 

తాతకి దూరమైన అత్తను మళ్లీ తన తండ్రి దగ్గరకు చేర్చడమే ఈ సినిమా కథ. కుటుంబంతో కలిసి జీవించాలని చివరి దశలో తాత అడిగిన కోర్కెను తీర్చే మనవడిగా పవన్ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అత్తను తాతకు దగ్గరకు తీసుకురావడంలో భాగంగా వారి కుటుంబంలో కలిసిపోతాడు. అక్కడ అనేక పరిస్థితులను చూస్తాడు. కథలో భాగంగా గతంలో ఆ కుటుంబంలో జరిగిన విషాద సంఘటనలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. పవన్ హీరో ఎలివేషన్స్ తప్ప కంప్లీట్ గా కుటుంబ నేపథ్యమే కనిపిస్తుందీ సినిమాలో. తండ్రి – కూతరు, తాత – మనవడు.. మధ్య నడిచే కథనం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.

IHG

 

క్లైమాక్స్ లో వచ్చే 15 నిమిషాల సన్నివేశం సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. సినిమాకు సంబంధించిన కథ మొత్తం అక్కడే జరుగుతుంది. కుటుంబ ప్రేక్షకుల్నే కాకుండా పవన్ అభిమానులను కూడా కట్టిపడేసిన సన్నివేశం అది. పవన్, నదియా, బోమన్ ఇరానీ.. నటన, హావభావాలకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీంతో సినిమా తిరుగులేని ఇండస్ట్రీ హిట్ సాధించింది. పవన్ కల్యాణ్ తన కెరీర్లో చేసిన కుటుంబ కథా సినిమాగా అత్తారింటికి దారేది నిలిచిపోయింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: