సీనియర్ హీరో, డైలాగ్ కింగ్ మోహన్ బాబు సూపర్ హిట్ చిత్రం పెదరాయుడు సినిమా రిలీజై 25ఏళ్ళు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర విశేషాలని పంచుకున్నారు. అయితే అప్పట్లో ఈ చిత్రం చిరంజీవి బిగ్ బాస్ తో పోటీపడి పైచేయి సాధించింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన పెదరాయుడు బాక్సాఫీసుని షేక్ చేసింది. అయితే అదలా ఉంచితే, ప్రస్తుతం మోహన్ బాబు సినిమాలు ఎక్కువగా చేయట్లేదు.

 

నిజానికి మోహన్ బాబు ఎలాంటి పాత్రలోనైనా మెప్పించగలడు. పాత్రకి మరింత ఇంపార్టెన్స్ ని తీసుకురాగలడు. మరి అలాంటి నటుడిని తెలుగు దర్శకులు తమ సినిమాల్లో ఎందుకు ఒప్పించలేకపోతున్నారో అర్థం కావట్లేదు. గాయత్రి సినిమా తర్వాత మోహన్ బాబు చాలా గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం తమిళ నటుడు సూర్య నటించిన ఆకాశం  నీ హద్దురా చిత్రంలో నటిస్తున్నాడు. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది.

 


ఈ పాటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం లాక్డౌన్ వల్ల వాయిదా పడింది. థియేటర్లకి అనుమతి లభించాక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే ఇదే గాక మణిరత్నం దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ  పొన్నియన్ సెల్వమ్ లోనూ మోహన్ బాబు నటించనున్నాడు. అయితే డైరెక్ట్ తెలుగులోనూ ఎప్పుడు కనిపిస్తారని అడగ్గా, తమ ఫ్యామిలీ బ్యానర్ లో తెరకెక్కే భారీ కుటుంబ కథా చిత్రంలో కనిపిస్తాడట. 

 

ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తయ్యాయని సమాచారం. ఈ సినిమా భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో రూపొందనుమ్దట. అయితే దర్శకుడు ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. కుటుంబ కథా చిత్రంతో మరో పెదరాయుడు సినిమాలా ఉంటుందట.  మరి పెదరాయుడు సినిమాలాగే ఆ కుటుంబ కథా చిత్రం కూడా విజయవంతం అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: