ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత పెళ్ళి చేసుకుని సినిమాలకి దూరమైన ప్రియమణి, మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. మన ఊరి రామాయణం సినిమా తర్వాత నాలుగేళ్లకి మళ్లీ తెలుగులో కనిపించనుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. వెంకటేష్ నారప్ప ఒకటికాగా, విరాట పర్వం మరోటి. అయితే విరాట పర్వంలో ప్రియమణి పాత్ర చాలా కీలకంగా ఉండనుందట.

 

రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాట పర్వం చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నీది నాది ఒకే కథ సినిమా ద్వారా సెన్సిబుల్ టాపిక్ ని చాలా హృద్యంగా చూపించిన వేణు, ఈ సారి నక్లలైట్ల కాలం నాటి కథని మనకి చూపించబోతున్నాడు. తెలంగాణలో ఒకప్పుడు నక్సలైట్లు ఎక్కువగా ఉండేవారు. 1990 ప్రాంతంలో జరిగిన కథగా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాడు.

 

ఇప్పటికే రిలీజైన పోస్టర్లకి విశేష స్పందన లభించింది. ఒక సినిమా పోస్టర్ ద్వారా అటెన్షన్ గ్రాబ్ చేసిన వేణు ఊడుగుల సినిమా ద్వారా మళ్లీ హిట్ కొడతాడని నమ్ముతున్నారు. అయితే ఈ సినిమాలో ఒకానొక కీలక పాత్రలో ప్రియమణి నటిస్తున్న విషయం తెలిసిందే. నక్సల్ భారతక్కగా ప్రియమణి పాత్ర ఉండనుంది. అయితే నక్సలైట్ గా కనపించడానికి ప్రియమణి కొంత రీసెర్చ్ కూడా చేసిందట.

 

అందులో భాగంగానే మాజీ నక్సలైట్ దగ్గర శిక్షణ తీసుకుందట. అప్పటి కాలం నాటి పరిస్థితులు, అడవుల్లో వారి జీవన విధానం, తదితర సంబంధిత విషయాలని బాగా తెలుసుకుందట. అవన్నీ ఆ పాత్రకి బాగా హెల్ప్ అయ్యాయట. మొత్తానికి నాలుగేళ్ళ విరామం తర్వాత తెలుగులో కనిపిస్తున్న ప్రియమణీ గుర్తుండిపోయే పాత్రనే చేసినట్టు తెలుస్తుంది. మరి థియేటర్లో ఆ పాత్ర ఎలా పేలుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: