కోవిడ్ 19 వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు జనాల్లో ఆందోళనని కలిగిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో గజగజ వణికిపోతున్నారు. కరోనా వల్ల అన్ని పరిశ్రమలకి తీవ్ర నష్టం వాటిల్లింది. అలా నష్టపోయిన వాటిలో సినిమా పరిశ్రమ కుడా ఒకటి. థియేటర్లు మూతబడడంతో నిర్మాతలకి బాగా నష్టం వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి.

 


ఆల్రెడీ చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాల సంగతి పక్కన పెడితే, సగంలో ఆగిపోయిన సినిమాల పరిస్థితి మరీ ఘోరం. కరోనాకి ముందు వేసుకున్న ప్లాన్లన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. మళ్లీ కొత్త ప్లాన్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడెక్కడో షూటింగ్ చేద్దామనుకున్నవారు మనదేశం దాటి వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. దాంతో ఆల్రెడీ ఇతర దేశాల్లో కొంత భాగం షూట్ చేసుకొన్నవారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు.

 

అయితే నాగార్జున తన తదుపరి చిత్రమైన వైల్డ్ డాగ్ కోసం రిస్క్ తీసుకోబోతున్నాడని తెలుస్తుంది. మన్మధుడు 2 డిజాస్టర్ తర్వాత వస్తున్న ఈ చిత్రంలో ఎన్ ఐ ఏ అధికారిగా నాగార్జున కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం థాయ్ లాండ్ వెళ్లాల్సి ఉందట. ఆ చిత్రీకరణ ఖచ్చితంగా అక్కడే షూట్ చేయాల్సి ఉందట. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అక్కడికి వెళ్లాలని అనుకుంటున్నారట.

 

 

ఈ విషయమై ఇంకా క్లారిటీ లేనప్పటికీ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. మరి కరోనా విజృంభిస్తున్న ఇలాంటి సమయంలో చిత్రీకరణ జరపడమే పెద్ద రిస్క్ గా భావిస్తున్నారు. అలాంటిది ఇతర దేశాల్లో షూటింగ్ అంటే పెద్ద రిస్కే అని చెప్పాలి. మరి నాగార్జున ఏం చేస్తాడో చూడాలి. ఈ సినిమాకి మహేష్ బాబు సినిమాకి రచయితగా పని చేసిన  సల్మాన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: