మన తెలుగులో కొన్ని కొన్ని సినిమాలకు ఎప్పుడు కూడా ఆదరణ ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. కొన్ని సినిమాలు టీవీ లో వచ్చినా సరే కచ్చితంగా చూస్తూ ఉంటారు జనాలు. అది స్టార్ హీరో సినిమా అయినా చిన్న హీరో సినిమా అయినా సరే టీవీ లో వచ్చింది అంటే కచ్చితంగా చూస్తూ ఉంటారు. అందులో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలు అనగానే జనాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని సినిమా అనగానే చాలా మందికి ఒక రేంజ్ లో పిచ్చి ఉంటుంది. సినిమా ఏ విధంగా ఉన్నా సరే జనాలు కచ్చితంగా ఆదరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. 

 

ఇక ఆయన సినిమాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరైన సినిమా అరవింద సమేత. ఆ సినిమా అతని కెరీర్ లో ఒక సంచలనం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది అని చెప్పాలి. ఈ సినిమాలో ఉండే సీన్ లు కొన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చాయి అని చెప్పాలి. ఇక హీరోయిన్ పూజ నటన కూడా బాగానే ఉంది. ఆమె ఫ్యామిలీ తో ఎన్టీఆర్  ఉన్న సన్నివేశాలు ఆడియన్స్ కి బాగా నచ్చాయి అనే చెప్పాలి. ఇక సినిమాలో ఉండే ఫ్యాక్షన్ కూడా సినిమాకు హైలెట్ అయింది. 

 

జగపతి బాబు నటన కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చింది అని చెప్పవచ్చు. ఈ సినిమా వసూళ్లు కూడా చాలా బాగా వచ్చాయి అని చెప్తారు జనాలు. అప్పుడు ఏ సినిమా కూడా సాధించని విధంగా ఈ సినిమా వసూళ్లను కొన్ని ప్రాంతాల్లో సాధించి నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది అని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: