మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం `ప్రతిరోజూ పండగే`. వినూత్న కాన్సెప్ట్‌లతో కమర్షియల్‌ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు మారుతీ ఒక ఫీల్‌గుడ్‌ టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్ అందుకున్నాడు. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే బంధాలు, బాంధవ్యాలు నేపథ్యంగా తెలుగు తెరపై చాలా సినిమాలే వచ్చాయి. ఇలాంటి సినిమాలు ప్రేక్ష‌కుల‌ను కూడా బాగానే ఆక‌ట్టుకుంటున్నాయి. అలాంటి నేపథ్యంతో తండ్రి, కొడుకుల రిలేషన్స్‌తో వచ్చిన చిత్రం ప్రతి రోజు పండగే సినిమా.

IHG

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా న‌టించింది. ఓ పెద్దాయనకు క్యాన్సర్ వస్తే కొడుకులు ఎవరూ పట్టించుకోకపోవ‌డంతో.. మనవడు వచ్చి మ్యాజిక్ చేసి ఆకాశాన్ని అంటే ఆనందాన్ని ఇచ్చి, కొడుకులను దగ్గర చేస్తాడు. ప్రతి రోజు పండగ జరిపిస్తాడు. ఈ సినిమా క‌థ పాత‌దే అయినా.. ద‌ర్శ‌కుడు మారుతి ప్రేక్ష‌కుల‌కు చాలా కొత్త‌గా చూపించారు. అంతేకాదు, ఈ సినిమా ఎంత ఎమోష‌న్ ఉంటుందో.. అంతే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అందుకే ఈ సినిమాకు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. ఇక సాయిధరమ్ తేజ్‌కు తాత క్యారెక్టర్‌లో సత్యరాజ్ తండ్రిగా రావు రమేష్ తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. 

IHG

ముఖ్యంగా రావు రమేష్ మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి.  ఇక వరుసగా అరడజను సినిమాలు ఫ్లాప్‌ అవ్వడంతో ఇక సాయి ధరమ్‌ తేజ్‌ కెరీర్‌ ఖతం అయ్యిందని భావిస్తున్న తరుణంలో చిత్రలహరి చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్నాడు. ఆ సినిమా తరవాత ‘ప్రతిరోజూ పండగే’ అని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రం కూడా హిట్ అవ్వ‌డంతో.. సాయి కెరీర్ మంచి జోష్ మీద సాగుతుంది. అంతేకాదు, ఇప్పటి వరకు కమర్షియల్ హీరోగా ముద్ర వేసుకొన్న సాయిధరమ్ తేజ్ ఈ చిత్రంతో ఫ్యామిలీ హీరోగా మారిపోయాడు. ఒక ఈ సినిమా గురించి ఒక ముక్క‌లు చెప్పాలంటే..  అటు ఎంటర్టైన్మెంట్.. ఇటు ఎమోషన్‌.. రెండు క‌లిపితే ప్రతిరోజూ పండగే..!!
 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: